• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అసభ్యంగా తాకితే కొట్టాను,...

అసభ్యంగా తాకితే కొట్టాను, అతడు నన్ను కొట్టాడు..!

| తన వ్యాఖ్యలు వక్రీకరించారు అంటూ ఫాతిమా సనా షేక్ చెప్పుకొచ్చింది. ఇటీవల ఫాతిమా నటించిన 'మెట్రో ఇన్‌ డినో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By - Tupaki Desk
Update: 2025-07-11 14:34 GMT

దంగల్‌ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ ఫాతిమా సనా షేక్‌. ఆ సినిమాలో ఆమీర్ ఖాన్‌కి జోడీగా నటించిన ఫాతిమా సనా షేక్‌ ఆ వెంటనే థగ్స్ ఆఫ్ హిందుస్తాన్‌ సినిమాలో ఆయనకు జోడీగా నటించిన విషయం తెల్సిందే. సినిమాలతో కంటే ఎక్కువగా వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలుస్తున్న ఫాతిమా సనా షేక్‌ ఆ మధ్య ఒక తమిళ సినిమాలో నటిస్తున్న సమయంలో చాలా అసభ్యంగా ప్రవర్తించారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఆ సమయంలో తాను తీవ్రమైన మనోవేదనకు గురి అయినట్లు చెప్పింది. సౌత్‌ సినిమా ఇండస్ట్రీపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

తన వ్యాఖ్యలు వక్రీకరించారు అంటూ ఫాతిమా సనా షేక్ చెప్పుకొచ్చింది. ఇటీవల ఫాతిమా నటించిన 'మెట్రో ఇన్‌ డినో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనురాగ్‌ బసు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. దాంతో ఫాతిమా సనా షేక్ జోరు మీద ఉంది. ఇటీవలే చిత్ర యూనిట్‌ సభ్యులు సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. సినిమా హిట్ కావడంతో మీడియా ముందుకు వచ్చి తన సంతోషాన్ని షేర్‌ చేసుకుంది. ఒక ఇంటర్వ్యూలో ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ ఇటీవల తాను ఎదుర్కొన్న ఒక షాకింగ్‌ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఆ సంఘటనతో చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.

ఇటీవల తాను ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఓ వ్యక్తి నాతో అనుచితంగా ప్రవర్తించాడు. అతడి ప్రవర్తనతో షాక్ అయ్యాను. అతడు అసభ్యంగా తాకడంతో చెంపపై ఒక్కటి కొట్టాను, అతడు వెంటనే నన్ను కొట్టాడు. అతడు కొట్టడంతో నేను కింద పడి పోయాను. ఆ ఘటన నుంచి తేరుకోవడానికి కొంత సమయం పట్టిందని చెప్పుకొచ్చింది. అలాంటి పరిస్థితులు ఎదురైన సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది. ముంబైలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా జరుగుతున్నాయని ఫాతిమా సనా షేక్ ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న కారణంగా అందరి దృష్టి ఉంటుందని ఆమె పేర్కొంది.

ముంబైలో నేను మాస్క్ ధరించి సైక్లింగ్‌ చేస్తున్న సమయంలో ఒక ట్రక్‌ డ్రైవర్‌ గుర్తు పట్టి నన్ను వెంబడించాడని అంది. ఆ సమయంలో అతడు నా వెనుక పదే పదే హార్న్‌ కొడుతూ ఉంటే ఇబ్బంది కలిగిందని చెప్పుకొచ్చింది. చాలా సమయం అతడి నుంచి తప్పుకోవడానికి ప్రయత్నించాను అంది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్‌లను చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. పెళ్లి సాంప్రదాయం పై తనకు పెద్దగా నమ్మకం లేదని గతంలో ఈమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత సౌత్‌ ఇండియన్‌ సినిమా సెలబ్రిటీల గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. మళ్లీ ఇప్పుడు ఈ విషయమై వైరల్‌ అవుతోంది.

Tags:    
  • FatimaSanaShaikh 
  • MetroInDino 
  • BollywoodNews 
  • FatimaControversy 
  • FilmIndustryTalk 
  • CelebrityNews 
  • WomensSafety 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS