పుష్ప 2 సాంగ్.. ఎదురుచూస్తున్న రికార్డులు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది పుష్ప ది రూల్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నారు.

Update: 2024-04-27 10:39 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది పుష్ప ది రూల్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రాబోతోంది. సుకుమార్ ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఐకాన్ స్టార్ అభిమానులు, పుష్పరాజ్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే మే 1న పుష్ప ది రూల్ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కాబోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలంటే సాంగ్స్ సూపర్ హిట్ గ్యారెంటీ అనే మాట మొదటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. ఆయన నుంచి వచ్చిన అల వైకుంఠపురములో, పుష్ప సినిమాలలో సాంగ్స్ అయితే నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశాయి. పుష్ప సాంగ్స్ అయితే ఇంటర్నేషనల్ లెవల్ లో సౌండ్ చేయడం విశేషం.

ఇప్పటికి ఎక్కడో ఓ చోట పుష్ప సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ కి పుష్ప సాంగ్స్ నేషనల్ అవార్డుని తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో పుష్ప ది రూల్ మూవీ నుంచి రాబోయే సాంగ్స్ పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి. వీటిని అందుకోవడానికి రాక్ స్టార్ కూడా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప ఫస్ట్ సాంగ్ కి ఇప్పుడు ఆసక్తికర రికార్డులు ఊరిస్తున్నాయి.

తెలుగులో 24 గంటల వ్యవధిలో హైయెస్ట్ వ్యూవ్స్ సొంతం చేసుకున్న సాంగ్ గా గుంటూరు కారం మూవీ నుంచి వచ్చిన ధమ్ మసాలా ఉంది. ఈ సాంగ్ 17.42 మిలియన్ వ్యూవ్స్ సొంతం చేసుకుంది. అత్యధిక లైక్స్ ని సర్కారువారిపాట నుంచి వచ్చిన కళావతి సాంగ్ తెచ్చుకుంది. ఈ సాంగ్ కి 806.3K లైక్స్ 24 గంటల్లో వచ్చాయి. ఈ రికార్డ్ ని పుష్పరాజ్ సాంగ్ బ్రేక్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

సౌత్ మొత్తం చూసుకుంటే ఇళయ దళపతి విజయ్ GOAT మూవీ నుంచి వచ్చిన విజిల్ పోడు సాంగ్ 24.88 మిలియన్ వ్యూవ్స్ తో టాప్ లో ఉంది. అలాగే లైక్స్ పరంగా దళపతి విజయ్ బీస్ట్ సినిమాలోని అరబిక్ కతు సాంగ్ నిలిచింది. ఈ సాంగ్ కి 24 గంటల్లో 2.2 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ రికార్డ్ కూడా పుష్ప ది రూల్ ఫస్ట్ సాంగ్ ముందు టార్గెట్ గా ఉంది. దీనిని ఎంత వరకు బ్రేక్ చేస్తుందనేది వేచి చూడాలి. అల్లు అర్జున్ బ్రాండ్, ఫ్యాన్ బేస్ పరంగా చూసుకుంటే 24 గంటల వ్యూవ్స్ రికార్డ్ ని జెట్ స్పీడ్ లో బ్రేక్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Tags:    

Similar News