ఇండస్ట్రీలో బ్రదర్స్ కాంబినేషన్స్!
మల్టీస్టారర్స్ పేరిట స్టార్ హీరోలంతా కలిసి పని చేయడం సర్వ సాధారణంగా మరింది. ఏ ఇద్దరి హీరోల ఇమేజ్ కు తగ్గ స్టోరీలు సెట్ అయితే చాలు కలిసి నటించడానికి పెద్దగా ఆలోచించడం లేదు.;
మల్టీస్టారర్స్ పేరిట స్టార్ హీరోలంతా కలిసి పని చేయడం సర్వ సాధారణంగా మరింది. ఏ ఇద్దరి హీరోల ఇమేజ్ కు తగ్గ స్టోరీలు సెట్ అయితే చాలు కలిసి నటించడానికి పెద్దగా ఆలోచించడం లేదు. సై అంటూ రంగంలోకి దూకేస్తున్నారు. కానీ వెండి తెరపై అన్నదమ్ములు కలిసి నటించడమే పెద్దగా కనిపించడం లేదు. స్టార్ హీరోల అన్నదమ్ముల్ని ఒకే ప్రేమ్ లో చూసుకోవాలని అభిమానులు ఆశపడుతున్నా? అది ఆశగానే మిగిలిపోతుంది తప్ప నెరవేరడం లేదు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కలిసి ఓ సినిమా చేస్తే చూడాలని మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.
కొన్ని దశాబ్దాలగా అభిమానుల్లో ఉన్న కోరిక ఇది. కానీ ఇంత వరకూ నెరవేర లేదు. ఇప్పటికైనా ఆ ద్వయం అలాంటి ఆలోచన చేస్తుందేమో చూడాలి. అదే ఫ్యామిలీ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా కలిసి నటించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఇద్దరు ట్రెండింగ్ హీరోలగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ -కళ్యాణ్ రామ్ కూడా కలిసి నటించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య అన్నదమ్ముల బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు.
ఆ బాండింగ్ ను బేస్ చేసుకుని ఇద్దరి ఇమేజ్ కు దగ్గ స్టోరీ రాయగల్గితే? కలిసి నటించడానికి వారిద్దరు సిద్దంగానే ఉంటారు. ఇంకా అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్- శిరీష్ కూడా ఇంత వరకూ కలిసి నటించలేదు. బన్నీ పాన్ ఇండియాలో పెద్ద స్టార్. కానీ శిరీష్ ఇంకా అంత పెద్ద స్టార్ కాలేదు. కానీ రీజనల్ మార్కెట్లో ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే మంచి ఫలితాలు సాధించొచ్చు. అలాగే అక్కినేని అన్నదమ్ములు నాగచైతన్య-అఖిల్ ని కూడా ఒకే ప్రేమ్లో చూసుకోవాలని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. `మనం` లో నటించినా అవి చాలా చిన్న రోల్స్.
ఇద్దరి కాంబినేషన్ లో సీన్స్ కూడా లేవు. ఈ నేపథ్యంలో చైతన్య-అఖిల్ ను ఒకే ప్రేమ్ లో చూసుకోవాలని అభిమానులు ఆశీస్తున్నారు. దగ్గుబాటి రానా-అభిరాం కూడా ఓ సినిమా చేయాలి. `అహింస`తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిరాంను అన్నయ్యతో చూడాలనుకుంటున్నారు. కానీ రానా కూడా అవకాశాలు కోసం ఎదురు చూసే పరిస్థితుల్లో ఉన్నాడు. అలాగే విజయ్ దేవరకొండ-ఆనంద్ దేవరకొండ కూడా కలిసి సినిమా చేసే అవకాశం ఉంది. ఇద్దరు హీరోలగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్-మంచు విష్ణు కూడా ఓ సినిమా చేయాల్సిన అవసరం ఉంది.
ఇద్దరు కలిస్తే చూడాలని మంచు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూర్య-కార్తీ తమిళ నటులైనా? కూడా ఒకే ప్రేమ్ లో చూడాలని తెలుగు అభిమానులు ఎంతో కోరుకుంటున్నారు. ఈ కాంబినేషన్స్ సాధ్యమ వ్వాలంటే? వారికి తగ్గ కథ సెట్ అవ్వాలి. అప్పుడే సాధ్యమవుతుంది.