పుష్పరాజ్ ముందే మ్యానరిజం.. చివరికి ఏం చేశారంటే?

తాజాగా హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్వహించిన గ్రాండ్ ఫ్యాన్స్ మీట్‌లో సరిగ్గా అలాంటి అద్భుతమైన సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.

Update: 2026-07-29 06:44 GMT

తన అభిమాన నటుడిని నేరుగా చూడటం, ఒక ఫొటో దిగడం అనేది ఏ అభిమానికైనా అపురూపమైన క్షణం. తాజాగా హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్వహించిన గ్రాండ్ ఫ్యాన్స్ మీట్‌లో సరిగ్గా అలాంటి అద్భుతమైన సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఒక వీరాభిమాని స్టేజీపై బన్నీని కలవడమే కాకుండా, ఆయన ముందే ‘తగ్గేదేలే’ అంటూ డైలాగ్ చెప్పి, కాళ్లు మొక్కి చెంపపై ముద్దుపెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ఐకాన్ స్టార్ ముందే 'తగ్గేదేలే':

హైదరాబాద్‌లో జరిగిన ఫ్యాన్స్ మీట్‌లో అల్లు అర్జున్ అభిమాని ఒకరు స్టేజీపైకి రాగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. వెంటనే తొడగొట్టి, బన్నీ ఐకానిక్ ‘పుష్పరాజ్’ శైలిలో ‘తగ్గేదేలే’ అంటూ మ్యానరిజం చేసి చూపించాడు. ఇక అభిమాని జోష్ చూసి అల్లు అర్జున్ కూడా నవ్వుతూ ఎంతో మురిసిపోయారు.

కాళ్లు మొక్కి.. చెంపపై ముద్దుపెట్టి:

తన కల నెరవేరిన ఆనందంలో ఆ అభిమాని వెంటనే ఐకాన్ స్టార్ కాళ్లకు దండం పెట్టాడు. అంతటితో ఆగకుండా ఎంతో ఆప్యాయంగా అల్లు అర్జున్ చెంపపై ముద్దుపెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక అభిమాని చేసిన ఈ పనికి అక్కడున్న వారంతా కేరింతలు కొట్టగా, బన్నీ కూడా అతడిని ఎంతో ప్రేమగా కౌగిలించుకుని మురిసిపోయారు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ అండ్ ఫన్నీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

6 గంటలు.. 900 మంది ఫ్యాన్స్:

ఈ ప్రత్యేక ఫ్యాన్స్ మీట్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ నుంచి దాదాపు 900 మంది అభిమానులు హాజరయ్యారు. వారందరికీ ప్రత్యేకంగా 'బ్లాక్ అండ్ బ్లాక్' డ్రెస్ కోడ్ నిర్ణయించారు. బన్నీ దాదాపు 6 గంటలు స్టేజీపై ఉండి, వచ్చిన ప్రతి అభిమాని‌తో ఫోటోలు దిగారు.

ప్రతి ఆరు నెలలకోసారి 'ఫ్యాన్స్ మీట్'?:

అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఫిదా అయిన అల్లు అర్జున్, ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలాంటి ప్రత్యేక ఫ్యాన్స్ మీట్ నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తన కోసం ఎక్కడెక్కడో నుంచి వచ్చిన అభిమానుల పట్ల బన్నీ చూపించిన ఈ ఆప్యాయతను చూసి నెటిజన్లు, ఫ్యాన్స్ 'దట్స్ ఐకాన్ స్టార్' అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

స్టార్ హీరో.. గొప్ప మనసు:

సినిమాల్లోనే కాదు, బయట కూడా అభిమానులకు ఇచ్చే గౌరవంలో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందే ఉంటారని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ఇక అభిమాని ముద్దుపెట్టి కాళ్లు మొక్కినా ఎంతో ఓపికగా, నవ్వుతూ స్వీకరించిన బన్నీ స్టైల్‌కు ఫ్యాన్స్ మరోసారి పడిపోయారు.



Tags:    

Similar News