• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫ్యామిలీ స్టార్.. ఆయనపైనే...

ఫ్యామిలీ స్టార్.. ఆయనపైనే భారమంతా!

| దీంతో మూవీ యూనిట్.. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా మ్యూజికల్ ప్రమోషన్లు స్టార్ చేసింది.

By - Tupaki Desk
Update: 2024-02-06 08:46 GMT

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ ఖుషి వంటి మ్యూజిక్‌ హిట్‌ తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌ చిత్రంలో నటిస్తున్నారు. తనకు గీతా గోవిందం వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ అందించిన పరశురామ్‌ తో మరోసారి చేతులు కలిపారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం.. సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఐరనే వంచాలా ఏంటి అంటూ విలన్లకు విజయ్‌ చూపించిన ఇన్నోసెంట్‌ యాటిట్యూడ్‌ ఆకట్టుకుంది. చివరకు వైఫ్‌ దగ్గర స్ట్రక్‌ అయిపోయినట్టుగా సాగే గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. గీతా గోవిందం తర్వాత విజయ్- పరశురామ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై ఓ వర్గంలో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ పరశురామ్ లాస్ట్ సినిమా సర్కారు వారి పాట సూపర్ హిట్ కాకపోవడంతో కొందరు సినిమాపై హోప్స్ తగ్గించుకున్నారు.

దీంతో మూవీ యూనిట్.. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా మ్యూజికల్ ప్రమోషన్లు స్టార్ చేసింది. నంద నందనా సాంగ్ ప్రోమోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేయగా.. సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ మరోసారి హృదయాన్ని హత్తుకునే ట్యూన్ ఇచ్చారని ఈ ప్రోమోను చూస్తే అర్థమవుతోంది. ఈ పూర్తి సాంగ్ రేపు రిలీజ్ కానుండగా... సినిమాపై మంచి బజ్ క్రియేట్ కానున్నట్లు తెలుస్తోంది.

హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రోమోలో కనిపించగా.. ఈ పాటను సిద్ధ్ శ్రీరామ్ పాడారని టీమ్ వెల్లడించింది. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాసినట్లు తెలిపింది. ఇక విజయ్ గీతా గోవిందం (2018) సినిమాలో ఇంకేం.. ఇంకేం కావాలే పాట ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోపీ సుందర్ స్వరపరిచిన ఆ పాటను కూడా సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు. అనంత్ శ్రీరామే లిరిక్స్ అందించారు.

అయితే ఫ్యామిలీ స్టార్‌ లోని నంద నందనా పాటకు అదే కాంబో రిపీట్ అవుతోంది. గోపీ సుందర్ బాణీలు కట్టిన ఈ నంద నందనా సాంగ్ మరి ఏ రేంజ్‍ లో ఆకట్టుకుంటుందో చూడాలి. మొత్తానికి ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేసే భారం.. డైరెక్టర్ పరశురామ్ కన్నా మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ పైనే పడిందన్న మాట.




Who do you think will win the Andhra Pradesh 2024 election?#AndhraPradeshElections2024 #YSRCP #TDP #Janasena #Tupaki

— Tupaki (@tupaki_official) February 6, 2024
Tags:    
  • Tollywood 
  • Vijaydevarakonda 
  • Mrunalthakur 
  • Familystar 
  • Familystarmovie 
  • Dilraju 
  • Gopisundar 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS