• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫ్యామిలీ స్టార్​​.. ఓ...

ఫ్యామిలీ స్టార్​​.. ఓ పవర్ఫుల్ మగాడు

| ఈ ఫ్యామిలీ స్టార్ టైటిల్ గ్లింప్స్​ కాస్త క్రేజీగా సాగింది. ఈ ప్రచార చిత్రంలో... విజయ్​ ఇంట్లో పనులు చేసే ఫ్యామిలీ మ్యాన్​గా అలాగే బయట రౌడీల బెండు తీసే పవర్ ఫుల్ మ్యాన్​గా కనిపించి ఆకట్టుకున్నారు.

By - Tupaki Desk
Update: 2023-10-18 18:12 GMT

స్టార్ హీరో ది విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. ఫ్యామిలీ స్టార్ టైటిల్​ను ఫిక్స్​ చేసి గ్లింప్స్​ వీడియోతో అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ చేశారు మేకర్స్. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ ఫ్యామిలీ స్టార్ టైటిల్ గ్లింప్స్​ కాస్త క్రేజీగా సాగింది. ఈ ప్రచార చిత్రంలో... విజయ్​ ఇంట్లో పనులు చేసే ఫ్యామిలీ మ్యాన్​గా అలాగే బయట రౌడీల బెండు తీసే పవర్ ఫుల్ మ్యాన్​గా కనిపించి ఆకట్టుకున్నారు. చూస్తుంటే మాస్ ఆడియెన్స్ తో పాటు సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా గట్టిగానే టార్గెట్ చేశారని అనిపిస్తోంది.

లైన్​లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైమ్​కు లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్​కు పంపించడాలు అనుకున్నావా సెటిల్​మెంట్​ అంటే అని ప్రతినాయకుడు బెదరించేందుకు ప్రయత్నిస్తుంటే... భలే మాట్లాడతారన్నా మీరంతా. ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా, పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా? ఐరెనే వంచాలా ఏంటి అంటూ పవర్​ ఫుల్​ డైలాగ్​తో స్లోగా నడుచుకుంటూ వెళ్లి ఐరాన్​ రాడ్​ను విజయ్​ వంచడం హైలెట్ అయ్యింది.

ఆ తర్వాత విలన్ గ్యాంగ్​లోని ఒకడి తలను గోడకేసి పగలగొట్టి.. సారీ బాబాయ్ కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయా అందుకే తలకాయ కొట్టేశా అంటూ విలన్​కు షాకిచ్చేలా విజయ్​ మరో ఫైటింగ్​ సీక్వెన్స్​ చేయడం అద్భుతంగా ఉంది. ఇక ప్రచార చిత్రం చివర్లో మృణాల్ ఏమండి అంటూ విజయ్​ను పిలవడం, వారిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్​ను చూపిస్తోంది. బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అయితే కూల్​గా చాలా బాగుంది.

ఇదంతా చూస్తుంటే ఫ్యామిలీ స్టార్ మూవీ ఒక కూల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. అలానే ఈ చిత్రం వచ్చే ఏడాది 2024 సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. గీతగోవిందం వంటి హిట్ సినిమా తర్వాత.. విజయ్ దేవరకొండ, పరుశురామ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో మంచి అంచనాలే ఉన్నాయి.

Full View
Tags:    
  • Tollywood 
  • Vijaydevarakonda 
  • Parasurampetla 
  • Dilraju 
  • Familystar 
  • Familystarmovie 
  • Mrunalthakur 
  • Glimpse 
  • Release 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS