• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అప్పుడు బాలయ్య, ఇప్పుడు...

అప్పుడు బాలయ్య, ఇప్పుడు విశ్వక్.. ఆహా క్రేజీ ప్లాన్

| ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్న తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఫ్యామిలీ ధమాకా అనే సరికొత్త గేమ్ షో రానుంది. దీనికి విశ్వక్ సేన్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

By - Tupaki Desk
Update: 2023-08-16 05:27 GMT

ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ తన యాటిట్యూడ్ అండ్ మూవీస్ తో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ క్రేజీ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చున్నారు. యాక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా, స్కిప్ట్ రైటర్ గా, డైరెక్టర్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకుని మల్టీటాలెంటెడ్ గా గుర్తింపు పొందారు. అయితే ఇప్పుడు హోస్ట్ గానూ మారబోతున్నారు.


ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్న తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఫ్యామిలీ ధమాకా అనే సరికొత్త గేమ్ షో రానుంది. దీనికి విశ్వక్ సేన్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక చూస్తున్నారుగా.. 'ఫ్యామిలీ ధమాకా' మాస్ కా దాస్ ఇలాకా!! ఇది మాస్ కా దాస్ ఆడించే ఫ్యామిలీ ఆట.. త్వరలోనే రాబోతోంది అంటూ ఆహా క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.

ఈ గ్లింప్స్ లో .. అందరికీ నమస్తే.. వెల్ కమ్ టూ మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ షో 'ఫ్యామిలీ ధమాకా.. ఇది దాస్ ఇలాకా అంటూ విశ్వక్ సేన్ తనదైన స్టైల్ లో హోస్టుగా తనకు తాను పరిచయం చేసుకుంటూ హుషారెత్తించారు. ఇది గ్లోబల్ సూపర్‌ హిట్ ఫ్యామిలీ గేమ్ షో.. త్వరలోనే మన తెలుగు కుటుంబాలలు ఇక్కడికి చేరబోతున్నాయి అంటూ ఈ వీడియోలో విశ్వక్ తెలిపారు.

అయితే ఈ గేమ్ షో కాన్సెప్ట్ ఏంటి? ఎన్ని ఎపిసోడ్స్ గా రానుంది? కంటెస్టెంట్ లు ఎవరనేది తెలుపలేదు. త్వరోలనే ఈ వివరాలు తెలియనున్నాయి. ఇకపోతే ఆహా అంతకుముందు నటసింహం నందమూరి బాలకృష్ణను హోస్టుగా పరిచయం చేస్తూ.. అన్ స్టాప‌బుల్ విత్ NBK సెలబ్రిటీ టాక్ షో చేసిన సంగతి తెలిసిందే. దీంతో బాలయ్య క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అలానే స్టార్ హీరోయిన్ సమంతతో సామ్ జామ్ అనే టాక్ షోను కూడా చేశారు. ఇప్పుడు తాజాగా 'ఫ్యామిలీ ధమాకా' గేమ్ షో అంటూ విశ్వక్ సేన్ ను హోస్ట్ గా పరిచయం చేస్తున్నారు. మరి వ్యాఖ్యాతగా విశ్వక్ ఎలా ఆకట్టుకుంటారో, ఈ గేమ్ షో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి..

ఇకపోతే పిట్టకథ షార్ట్ ఫిలింతో కెరీర్ షురూ చేసి.. వెళ్ళిపోమాకే హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ చిత్రాలతో హిట్ అందుకున్నారు విశ్వక్. ఆ తర్వాత హిట్, పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, దాస్ కా ధమ్కీ చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో పాటు VS10 సినిమాలను చేస్తున్నారు. నటిస్తున్నారు.

Tags:    
  • Tollywood 
  • Vishwaksen 
  • Aha 
  • Gameshow 
  • Ott 
  • Familydhamaka 
  • Host 
  • Balakrishna 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS