షెకావ‌త్ సార్ ఫ్యామిలీతో స‌మ్మ‌ర్ చిల్!

అన్న‌ది తెలియ‌దు గానీ తాజాగా 2024 స‌మ్మ‌ర్ ని మాత్రం బాగానే ఆస్వాదిస్తున్నారు.

Update: 2024-04-30 11:55 GMT

ఫ‌హాద్ పాజ‌ల్-న‌జ్ర‌యా న‌జీమ్ జంట‌గా క‌నిపిచ‌డం రేర్. భార్య‌భ‌ర్త‌లిద్ద‌రు సినిమా ఈవెంట్లలో క‌నిపిస్తారు త‌ప్ప‌! ఆ వేదిక దాటిన త‌ర్వాత విష‌యాలేవి బ‌య‌ట‌కు రానివ్వ‌రు. ఇద్ద‌రు క‌లిసిన ఫ్యామిలీ ఫోటోలు కూడా నెట్టింట త‌క్కువ‌గానే ఉంటాయి. మ‌రి త‌రుచూ వెకేష‌న్ల‌కు విదేశాల‌కు వెళ్తారా? లేదా? అన్న‌ది తెలియ‌దు గానీ తాజాగా 2024 స‌మ్మ‌ర్ ని మాత్రం బాగానే ఆస్వాదిస్తున్నారు. ఇద్ద‌రు స‌మ్మ‌ర్ లో చిల్ అవుతోన్న ఓ ఫోటో ఒక‌టి బ‌య‌టకు వ‌చ్చింది. ఇందులో ఫ‌హాద్ ష‌ర్ట్ లేకుండా...నిక్క‌రులో క‌నిపిస్తున్నాడు.


అత‌ని ముందు న‌జ్రియా మ‌ల్లిక‌ల‌ర్ బ‌నియ‌న్ ధ‌రించి..క‌ళ్ల‌కు స‌న్ గ్లాసెస్ పెట్టుకుని ఓ సెల్పీ దిగారు. ఆ ఫోటోని న‌జ్రియా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. లెస్ట్ చిల్ బేబి అంటూ భ‌ర్త‌ను ఉద్దేశించి ఆ క్యాప్స‌న్ ఇచ్చింది. ఆ ఫోటో నెట్టింట వైర‌ల్ గామారింది. భార్య‌భ‌ర్త‌లెప్పుడు ఇలా క‌నిపించ‌లేదు. అందులోనూ బీచ్ లాంటి ప్ర‌దేశాల్లో ఇంత‌వ‌ర‌కూ ఇలా క‌నిపించింది లేదు. దీంతో వీళ్లు వాళ్లేనా? అంటూ ఓకింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు నెటి జ‌నులు.

Read more!

ఇక నజ్రియా స్లిమ్ లుక్ ఆక‌ట్టుకుంటుంది. మునుప‌టి కంటే స‌న్న‌జాజిలా మారిపోయింది. తెలుగులో ఆమె 'అంటే సుంద‌రాన‌కీ' అనే సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అప్పుడే టాలీవుడ్ లో మీడియా హైలైట్ అయింది. ఆ సినిమాలో కాస్త చ‌బ్చీగానూ ఉంది. ఇప్పుడు మాత్రం స‌న్న‌జాజిలా మారిపోయింది. ఫ‌హాద్ గెడ్డం కూడా నెరిసిపోతుంది. అత‌ని వ‌య‌సు 41 కాగా న‌జ్రియా వ‌య‌సు 29 ఏళ్లు. ఇద్ద‌రి మ‌ధ్య 12 ఏళ్లు గ్యాప్ ఉంది.

వీరిది ప్రేమ వివాహం. పహాద్ పాజిల్ ట్యాలెంట్ గురించిచెప్పాల్సిన పనిలేదు. సుకుమార్ కారణంగా 'పుష్ప' సినిమాతో తెలుగు లో ఎంతో ఫేమ‌స్ అయ్యాడు. బ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ పాత్ర‌తో ఆ గుర్తింపు ద‌క్కింది. 'పుష్ప‌-2' తో అత‌డి క్రేజ్ రెట్టింపు అవుతుంది. అత‌డి మ‌ల‌యాళ సినిమాలిప్పుడు తెలుగులోనూ అనువాద‌మ‌వుతున్నాయి. ఇక న‌జ్రియా కి 'అంటే సుందరానికీ' త‌ర్వాత సినిమా అవ‌కాశాలు రాలేదు.

Tags:    

Similar News