• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫహద్ ఫాజిల్.. ఎక్కడ...

ఫహద్ ఫాజిల్.. ఎక్కడ చేసినా అదే క్రేజ్

| మళయాళంలో హీరోగా అదరగొడుతున్న ఆయనను, ఇక్కడ విలన్ గా తీసుకునేందుకు క్యూలు కడుతున్నట్లు తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2023-08-23 14:52 GMT

సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటీ నటులు చాలా మందే ఉన్నారు. ఆ టాలెంట్ తో అన్ని ఇండస్ట్రీల్లోనూ సత్తా చాటే అవకాశం అందరికీ రావచ్చు. కానీ, వస్తే మాత్రం సత్తా చాటకుండా ఉండరు. తాజాగా అలాంటి అవకాశం మళయాళ హీరో ఫహద్ ఫాజిల్ కి దక్కిందనే చెప్పాలి. ఆయన పేరుకు మళయాళ హీరో అయినప్పటికీ, అందరికీ సుపరిచితమే.

మాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్న ఆయన, ఇతర భాషల్లో సైడ్ క్యారెక్టర్లు,విలన్ పాత్రలు చేయడానికి కూడా ఏ మాత్రం వెనకాడరు. అయితే, కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఆయన ఎంచుకుంటారు. ఇప్పుడు దక్షిణాదిన అన్ని భాషల్లోనూ ఫహద్ ఫాజిల్ అంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పొచ్చు.

తెలుగులో పుష్ప మూవీలో పోలీసు పాత్రలో కనిపించాడు. అల్లు అర్జున్ కి ధీటుగా ఆయన క్యారెక్టర్ ని సుకుమార్ డిజైన్ చేయగా, ఫహద్ సైతం తన పాత్రలో ఒదిగిపోయారు. ఆయన కోసమే, రెండో పార్ట్ ఎప్పుడు విడుదలౌతుందా అని ఎదురుచూసేవారు కూడా ఉన్నారు అనడంలో అతిశయోక్తిలేదు. అంతలా తన పాత్రను రక్తికట్టించారు. ప్రీ క్లైమాక్స్ కి ముందు ఆయన పాత్ర వచ్చినా, తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఆకర్షించగలిగాడనే చెప్పాలి.

ఇక కమల్ హాసన్ విక్రమ్ సినిమాలోనూ ఫహద్ అదరగొట్టారు. రీసెంట్ గా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన మామన్నన్ లోనూ విలన్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో ఆయన నటనకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత, ఆయన పాత్రను మరింత ఎక్కువ మంది గుర్తించారు. ఫహద్ ఫాజిల్ ఎలాంటి పాత్ర అయినా అలవోకగా చేయగలరు. అయితే, విలన్ పాత్రలో మరింత అద్భుతంగా అదరగొట్టగలరు అని పుష్ప, మామన్నన్ లతో నిరూపించారు.

దీంతో, ఇప్పుడు దక్షిణాదిన చాలా సినిమాల్లో ఫహద్ ఫాజిల్ ని విలన్ గా తీసుకోవాలని దర్శక నిర్మాతలు చాలా మంది భావిస్తున్నారట. మళయాళంలో హీరోగా అదరగొడుతున్న ఆయనను, ఇక్కడ విలన్ గా తీసుకునేందుకు క్యూలు కడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫహద్ కి తెలుగు, తమిళ సినిమాల్లో విలన్ గా క్రేజీ ఆఫర్లు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags:    
  • Fahadfaisal 
  • Malayalamactor 
  • Pushpa1 
  • Mamannan 
  • Actor 
  • Villain 
  • Vikram 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS