బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ సీక్వెల్ కు డిస్క‌ష‌న్స్

ప్ర‌స్తుతం ఈ సీక్వెల్ డిస్క‌ష‌న్స్ ప్రారంభ ద‌శ‌లోనే ఉన్నాయని, ఈ సీక్వెల్ సోనీ హేస్, అపెక్స్ GP చుట్టూ తిరుగుతుంద‌ని జోసెఫ్ చెప్పారు.;

Update: 2025-11-17 16:30 GMT

ఈ మ‌ధ్య సినీ ఇండ‌స్ట్రీలో సీక్వెల్స్, ప్రీక్వెల్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. ఏదైనా సినిమా హిట్ అయితే ఆ సినిమాకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ను అనౌన్స్ చేసి ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ రాగా వాటిలో కొన్ని హిట్లుగా నిలిస్తే మ‌రికొన్ని ఫ్లాపులుగా నిలిచాయి. కాగా ఇప్పుడు మ‌రో స‌క్సెస్‌ఫుల్ మూవీకి సీక్వెల్ రాబోతుంది.

భారీ హిట్ గా నిలిచిన ఎఫ్1

బ్రాడ్ పిట్ న‌టించిన ఎఫ్1 మూవీ 1.8 బిల‌య‌న్ డాల‌ర్ల‌ను క‌లెక్ట్ చేసి, ఈ ఇయ‌ర్ లోనే అతి పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో ఒక‌టిగా నిలిచింది. జోసెఫ్ కోసిన్స్కీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ స్పోర్డ్స్ డ్రామా మూవీ ఫార్ములా1 రేసింగ్ ఆధారంగా రూపొందగా, అందులో బ్రాడ్ పిట్ సోనీ హేస్ అనే రేస‌ర్ క్యారెక్ట‌ర్ లో క‌నిపించి త‌న యాక్టింగ్ తో మెప్పించారు. ఎఫ్1 మూవీ సూప‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో ఇప్పుడా సినిమాకు సీక్వెల్ నిర్మించే అవ‌కాశ‌ముంద‌ని తాజాగా ఎమ్మీ అవార్డుల సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ జోసెఫ్ కోసిన్స్కీ తెలిపారు.

ఎఫ్1 సీక్వెల్ కు డిస్క‌ష‌న్స్

ప్ర‌స్తుతం ఈ సీక్వెల్ డిస్క‌ష‌న్స్ ప్రారంభ ద‌శ‌లోనే ఉన్నాయని, ఈ సీక్వెల్ సోనీ హేస్, అపెక్స్ GP చుట్టూ తిరుగుతుంద‌ని జోసెఫ్ చెప్పారు. తాజాగా జ‌రిగిన అకాడ‌మీ గ‌వ‌ర్న‌ర్ అవార్డుల కార్య‌క్ర‌మంలో జోసెఫ్ మాట్లాడుతూ ఎఫ్1కు సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుందా అని చ‌ర్చిస్తున్నామ‌ని, వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ సినిమాకు వ‌చ్చిన రెస్పాన్స్ ను చూశాక ఈ సీక్వెల్ ను చేయ‌డానికి తామంతా ఎంతో సంతోషంగా ఉన్నామ‌ని వెల్ల‌డించారు.

ఎఫ్1 మూవీ చూశాక ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకు సీక్వెల్ వ‌స్తే బావుంటుంద‌ని కోరుకున్నారు. ఇప్పుడు డైరెక్ట‌ర్ మాట‌ల్ని బ‌ట్టి చూస్తుంటే ఫ్యూచ‌ర్ లో ఈ ప్రాజెక్టు గురించి అనౌన్స్‌మెంట్ మ‌రియు త్వ‌ర‌లోనే ఈ సినిమా వ్చే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌కుండానే ఎఫ్1 సీక్వెల్ పై మంచి క్రేజ్ ఏర్ప‌డ‌గా, ఇక సినిమా సెట్స్ పైకి వెళ్తే దానికి భారీగా అంచ‌నాలు ఏర్ప‌డే అవ‌కాశముంది.

Tags:    

Similar News