• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎక్స్ ట్రా.. రాజశేఖర్...

ఎక్స్ ట్రా.. రాజశేఖర్ రోల్ అలా ఉంటుందా?

| టాలీవుడ్ లో హీరోగా, విలన్ గా తన విలక్షణమైన నటనతో యాంగ్రీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు రాజశేఖర్

By - Tupaki Desk
Update: 2023-11-26 13:16 GMT

టాలీవుడ్ లో హీరోగా, విలన్ గా తన విలక్షణమైన నటనతో యాంగ్రీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు రాజశేఖర్. ఈయన పేరు చెప్తే ఆడియన్స్ కి ఎక్కువగా సీరియస్ రోల్స్ గుర్తుకొస్తాయి. అలాంటి ఈయన మళ్లీ చాలా గ్యాప్ తర్వాత నితిన్ హీరోగా నటిస్తున్న 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడనే విషయం తెలియడంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.

దానికి తోడూ సినిమాలో రాజశేఖర్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా, సీరియస్ గా ఉంటుందని అనుకున్నారు. ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని, యాక్షన్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని వార్తలు కూడా వచ్చాయి. కట్ చేస్తే.. వీటన్నిటికీ కంప్లీట్ రివర్స్ గా సినిమాలో ఆయన క్యారెక్టర్ ఉంటుందట. ఇదే విషయాన్ని మేకర్స్ స్వయంగా తెలియజేశారు.

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో రాజశేఖర్ పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందట. ఈ క్యారెక్టర్ రాజశేఖర్ కి కూడా బాగా నచ్చిందట. అందుకే ఆయన వెంటనే నటించేందుకు ఒప్పుకున్నారట. రాజశేఖర్ స్మైల్ చాలా బాగుంటుందని, అది తమ సినిమాలో కనిపించాలని డైరెక్టర్ ముందే కండిషన్ పెట్టాడట. దీంతో ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేయనంత ఎంటర్టైన్మెంట్ చేస్తారట రాజశేఖర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమాలో రాజశేఖర్ నుంచి ఫుల్ లెన్త్ ఫన్ చూడబోతున్నారని మేకర్స్ అంటున్నారు.

ఇలా సినిమాలో రాజశేఖర్ పాత్ర పై ఆడియన్స్ ఊహించుకున్న దాని కంటే రివర్స్ లో మేకర్స్ స్పందించడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. రీసెంట్ గా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్ రిలీజ్ అయినప్పుడే ఇందులో ఫన్ ఎక్కువగా ఉండదు అనే విషయం ఆడియన్స్ కి అర్థమైంది. కానీ రాజశేఖర్ పాత్ర కూడా కామెడీగానే ఉంటుంది అనే విషయం తెలిసి చాలామంది సినీ లవర్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఎందుకంటే ఇప్పటి వరకు రాజశేఖర్ ఏ సినిమాలోనూ కామెడీ రోల్స్ చేయలేదు. అలాంటిది ఫస్ట్ టైమ్ వక్కంతం వంశీ ఈ సినిమాతో ఆయనలోని ఫన్ యాంగిల్ ని బయటికి తీయబోతున్నారు. ఆదిత్య మూవీస్ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    
  • Extraordinaryman 
  • Nithiin 
  • Sreeleela 
  • Rajashekar 
  • Filmindustry 
  • Extraordinarymanmovie 
  • Tollywood 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS