• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నా సామి రంగ.. మాస్ లో...

నా సామి రంగ.. మాస్ లో రొమాన్స్

| మరోవైపు, ఈ సినిమా ప్రమోషన్లను మేకర్స్ తాజాగా మొదలుపెట్టేశారు. ఈ సినిమా నుంచి ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే అంటూ సాగే లిరకల్ సాంగ్ ను ఆదివారం రిలీజ్ చేశారు.

By - Tupaki Desk
Update: 2023-12-10 07:36 GMT

టాలీవుడ్ మన్మథుడు, సీనియర్ హీరో నాగార్జున కొంచెం గ్యాప్ తీసుకుని అనౌన్స్ చేసిన సినిమా నా సామి రంగ. గత కొన్ని నెలలుగా థియేటర్లలో సందడి చేయని నాగ్.. నేరుగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచారు. బాక్సాఫీస్ వద్ద మరో నాలుగు సినిమాలతో పోటీ పడనున్నారు. ప్రస్తుతం నాగార్జున సినిమా షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నారు మేకర్స్.


ఈ సినిమాలో నాగార్జున సరసన కన్నడ భామ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకో హీరోయిన్ కూడా ఉందని సమాచారం. డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, పోస్టర్స్ చూస్తుంటే పండుగకు నాగార్జున మంచి సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఈ సినిమా ప్రమోషన్లను మేకర్స్ తాజాగా మొదలుపెట్టేశారు. ఈ సినిమా నుంచి ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే అంటూ సాగే లిరకల్ సాంగ్ ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ రాయగా.. ఆస్కార్ దర్శకుడు ఎంఎం కీరవాణి బాణీలు అందించారు. సింగర్ రామ్ మిరియాల ఈ పాటకు తన గాత్రంతో ప్రాణం పోశారు.

ఈ సాంగ్ లో నాగార్జున, ఆషికా రంగనాథ్ కలిసి వేసిన స్టెప్స్ ను మేకర్స్ చూపించారు. నాగ్- ఆషిక కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటోంది. లిరికల్ సాంగ్ లో ఎప్పటిలాగే తన లుక్స్ తో నాగార్జున ఆకట్టుకోగా.. ఆషిక కుందనపు బొమ్మలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పాటలో విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో ఉంది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇక సంక్రాంతి పండగకు నాగార్జున ఎప్పటిలాగే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని అంతా భావిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అని మేకర్స్ ఇప్పటికే చెప్పినా ఈ సినిమా విడుదల తేదీ మాత్రం ఇంకా ప్రకటించలేదు. జనవరి 11 లేదా 14వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

Full View
Tags:    
  • Naasaamiranga 
  • Nagarjuna 
  • Mmkeeravani 
  • Etthukellipovalanipisthunde 
  • Naasaamirangamovie 
  • Rammiryala 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS