హ‌ర్థిక్ తో న‌టి 2 నెల‌లు డేటింగ్ నిజ‌మేనా?

తాజాగా సిద్ధార్థ్ క‌న్న‌న్ తో ఇంటర్వ్యూలో ఇషా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ''అవును నిజ‌మే.. మేం కొంతకాలం మాట్లాడుకున్నాము.;

Update: 2025-06-25 13:27 GMT

బోల్డ్ ఫోటోషూట్ల‌తో నిరంతరం సోష‌ల్ మీడియాల ద్వారా ట‌చ్ లో ఉంది ఇషా గుప్తా. ఈ భామ తన గ్లామ‌ర‌స్ లుక్స్, డేటింగ్ లైఫ్ కార‌ణంగా నిరంత‌రం వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇషా గుప్తా ప్ర‌ముఖ క్రికెట‌ర్ హార్థిక్ పాండ్యాతో డేటింగ్ చేసిందంటూ అప్ప‌ట్లో పుకార్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ ఇద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు నిరంత‌రం మాట్లాడుకునేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రిచార‌ని, ఒక‌రితో ఒక‌రు స‌న్నిహితంగా మెలిగార‌ని క‌థనాలొచ్చాయి.

 

తాజాగా సిద్ధార్థ్ క‌న్న‌న్ తో ఇంటర్వ్యూలో ఇషా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ''అవును నిజ‌మే.. మేం కొంతకాలం మాట్లాడుకున్నాము. అయితే డేటింగ్ చేస్తున్నామని నేను అనుకోను... కానీ మేం రెండు నెలలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాము'' అని తెలిపింది. ''హార్దిక్‌తో తాను చాలా తక్కువ కాలం మాత్రమే టచ్ లో ఉన్నానని, మా మ‌ధ్య‌ సమీకరణం ఎప్పుడూ సంబంధంగా మారలేద''ని ఈషా ధృవీకరించింది.

 

అయితే పాండ్యాతో డేటింగ్ కుదిరి ఉండొచ్చు.. కానీ బిజీ షెడ్యూళ్ల కార‌ణంగా ఏదీ అనుకూలించ‌లేద‌ని ఇషా గుప్తా వెల్ల‌డించింది. త‌మ మ‌ధ్య ఎలాంటి నాట‌కీయ‌త లేదు.. చేదు విష‌యాలు లేవు! అని ఇషా తెలిపింది. కాఫీ విత్ కరణ్‌లో తన వివాదాస్పద ఎపిసోడ్ తర్వాత హార్దిక్ పాండ్యా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. కానీ హార్దిక్ వెనుక ఉన్న వివాదం తనను ప్రభావితం చేయలేదని, ఎందుకంటే పుకార్లు వచ్చినప్ప‌టికే తాము టచ్‌లో లేమ‌ని ఈషా వెల్లడించింది. ఈషా గుప్తా గ‌త ఐదు సంవత్సరాలుగా స్పానిష్ కుర్రాడు మాన్యుయెల్ కాంపోస్ గుల్లార్‌తో డేటింగ్ లో ఉంది. ఈషా గుప్తా కొన్ని సంవత్సరాల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో అతనితో తన సంబంధాన్ని అధికారికంగా తెలియజేసింది.

Tags:    

Similar News