• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎంపురాన్ నిర్మాతపై ఈడీ...

ఎంపురాన్ నిర్మాతపై ఈడీ దాడులు.. రివెంజా?

| మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో ఎంపురాన్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-04-04 09:46 GMT

మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో ఎంపురాన్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాను నిర్మించిన గోకులం గోపాలన్ చిట్ ఫండ్ కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. కేరళతోపాటు చెన్నై కోడంబాక్కంలోని గోపాలన్ చిట్‌ ఫండ్ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.

అయితే గోకులం చిట్ ఫండ్ కంపెనీ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. 2017లో ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వహించి, రూ.1000 కోట్లకుపైగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపించింది. ఇప్పుడు FEMA కేసులో ఈడీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిధుల మళ్లింపులు లేదా మనీలాండరింగ్‌ సహా ఏదైనా చట్టవిరుద్ధ ఆర్థిక లావాదేవీల్లో కంపెనీ ప్రమేయం ఉందా అన్న విషయాన్ని ధృవీకరించడంపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు, ఎంపురాన్ మూవీ వివాదంలో చిక్కుకున్న వేళ.. కేంద్రం ప్రతీకార చర్యగా ఈడీతో దాడులు చేయిస్తుందని ఆరోపిస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

గోకులం గోపాలన్ రీసెంట్ గా నిర్మించిన ఎంపురాన్ మూవీ మార్చి 27వ తేదీన రిలీజ్ అయింది. అయితే సినిమాలో 2002లో జరిగిన గుజరాత్ లో జరిగిన గోద్రా అల్లర్లకు సంబంధించిన సీన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయని వివాదం నెలకొంది. దీంతో మేకర్స్.. సెన్సార్ బోర్డును సంప్రదించారు.

అప్పుడు సెన్సార్ బోర్డు అధికారులు కొన్ని కోతలు విధించగా.. ఇప్పుడు ట్రిమ్ వెర్షన్ అందుబాటులో ఉంది. కానీ వివాదం మాత్రం సాగుతూనే ఉంది. రీసెంట్ గా రాజ్యసభకు సినిమా మ్యాటర్ చేరింది. దీంతో మాలీవుడ్ యాక్టర్ కేంద్రమంత్రి సురేష్ గోపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు వ్యాఖ్యలు చేస్తూ కొందరు సభ్యులపై మండిపడ్డారు.

ఇప్పుడు శుక్రవారం ఈడీ.. గోపాలన్ కు చెందిన ఐదు కార్యాలయాల్లో దాడులు చేపట్టింది. దీంతో ఎంపురాన్ మూవీ వివాదానికి ఈడీ దాడులకు సంబంధం ఉందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో కీలక పత్రాలు, డిజిటల్ రికార్డులను ఈడీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారంలో చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    
  • Empuraan 
  • MohanLal 
  • GokulamGopalan 
  • EDRaids 
  • PrithvirajSukumaran 
  • FEMA 
  • GodhraControversy 
  • MollywoodNews 
  • SureshGopi 
  • CensorshipDebate 
  • EDvsCinema 
  • IndianCinemaControversies 
  • L2Empuraan 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS