• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దానయ్య, విజయ్.. ఆ...

దానయ్య, విజయ్.. ఆ సినిమాని రీమేక్ చేయబోతున్నారా?

| వీరి కాంబినేషన్ ప్రాజెక్టుకు సంబంధించి రోజుకో వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరికొన్ని లీక్స్ బయటకు వచ్చాయి.

By - Tupaki Desk
Update: 2024-02-02 11:52 GMT

కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'గోట్' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో రాబోతోంది. జూన్ లో ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు తర్వాత తలపతి విజయ్ 'RRR' నిర్మాత DVV దానయ్యతో సినిమా చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

వీరి కాంబినేషన్ ప్రాజెక్టుకు సంబంధించి రోజుకో వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరికొన్ని లీక్స్ బయటకు వచ్చాయి. అదేంటంటే.. మొన్నటి వరకు విజయ్ -DVV దానయ్య కాంబినేషన్ సినిమాకి 'జిగర్తాండ' మూవీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసే అవకాశం ఉందని న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడు అతని స్థానంలో మరో కోలీవుడ్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది.

ఖాకీ, వలిమై, తెగింపు వంటి సినిమాలను తెరకెక్కించిన H. వినోద్ ని ఈ ప్రాజెక్ట్ కోసం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే మేకర్స్ ఇంకా డైరెక్టర్ ఎవరు అనేది ఫైనల్ చేయలేదట. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, గత ఏడాది అనిల్ రావిపూడి - బాలయ్య కాంబినేషన్లో వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమాకి రీమేక్ గా ఈ ప్రాజెక్టుని తెరకెక్కించబోతున్నట్లు చెబుతున్నారు.

ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్డ్ సినిమాలు దళపతి విజయ్ కి బాగా సూట్ అవుతాయి. ఇప్పటికే ఈ కాన్సెప్ట్ తో విజయ్ హీరోగా 'బిగిల్' సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అందుకే 'భగవంత్ కేసరి' రీమేక్ చేసేందుకు విజయ్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. విజయ్ కెరియర్లో 69వ సినిమాగా తెరకెక్కే ఈ ప్రాజెక్టును అతి త్వరలోనే పట్టాలెక్కించి ఇదే ఏడాది షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ ప్రాజెక్టు కోసం డివివి దానయ్య విజయ్ కి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. డివివి దానయ్య ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో 'OG, న్యాచురల్ స్టార్ నానితో 'సరిపోదా శనివారం' వంటి సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు చిత్రీకరణ దశలోనే ఉన్నాయి.

Tags:    
  • Tollywood 
  • Producer 
  • Dvv 
  • Kollywood 
  • Starhero 
  • Vijaythalapathy 
  • Movie 
  • Remake 
  • Bhagavanthkesari 
  • Women 
  • Hvinod 

Similar News

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

Copyright @2026

Powered by Blink CMS