• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డంకీ డ్రాప్ 5.. ఈసారి సర్...

డంకీ డ్రాప్ 5.. ఈసారి సర్ ప్రైజ్ ఏంటంటే..

| బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ కాంబినేషన్‌లో రూపొందిన డంకీ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది.

By - Tupaki Desk
Update: 2023-12-11 06:14 GMT

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ కాంబినేషన్‌లో రూపొందిన డంకీ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ తెగ ఆకట్టుకున్నాయి. అవి డ్రాప్ 1, డ్రాప్ 2, డ్రాప్ 3, డ్రాప్ 4గా విడుదలయ్యాయి. తాజాగా డ్రాప్-5 పేరుతో ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.


ఓ మాహీ అంటూ సాగే సాంగ్ కు సంబంధించిన గ్లింప్స్ ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. త్వరలోనే ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సాంగ్ లో మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వైరల్ గా మారాయి.

ఇటీవలే షారుక్ తన అభిమానులతో #AskSRK పేరుతో చిట్ చాట్ నిర్వహించారు. ఆ సమయంలో డంకీ సినిమాలోని ఓ మాహీ సాంగ్ తనకెంతో ఇష్టమని చెప్పారు. అప్పటి నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఈ పాట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి గ్లింప్స్ రిలీజ్ కావడంతో ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేస్తునట్లు చెబుతున్నారు

పఠాన్, జవాన్ చిత్రాల విజయాల జోరు మీద ఉన్న షారుక్ ఖాన్.. డంకీ సినిమాతో డిసెంబర్ 21వ తేదీన థియేటర్లలోకి రాబోతున్నారు. షారుక్‌తో పాటు నటి తాప్పీ పన్ను ప్రధాన పాత్రలో నటించింది. నటుడు విక్కీ కౌశల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో బొమన్ ఇరానీతో పాటు మరికొందరు ముఖ్య నటీనటులు నటించారు.

అక్రమంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లే వలసదారుల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సంజు సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో డంకీ పై ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. 2023లో షారుక్ నటించిన రెండు సినిమాలు పఠాన్, జవాన్ సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు డంకీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపబోతోందని అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ సినిమా ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Sab poochte hain Iss liye bata raha hoon. Dunki ka matlab hota hai apno se door rehna….aur jab apne paas ho toh bas lagta hai qayamat tak uske saath hi rahein. O Maahi O Maahi. Feel the love before sun sets on the horizon today.

Because everybody asks, what does Dunki mean?… pic.twitter.com/rvdUBaUWPL

— Shah Rukh Khan (@iamsrk) December 11, 2023
Tags:    
  • Dunki 
  • Drop5 
  • Omahisong 
  • Sharukhan 
  • Rajkumarhirani 
  • Tapsee 
  • Bollywood 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS