• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో తెలుగు సినిమాకు...

మరో తెలుగు సినిమాకు దుల్కర్ గ్రీన్ సిగ్నల్​

| మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న హీరో దుల్కర్‌ సల్మాన్‌

By - Tupaki Desk
Update: 2023-09-07 11:30 GMT

మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న హీరో దుల్కర్‌ సల్మాన్‌. ఎప్పుడూ వరుస సినిమాలతో ఆడియెన్స్​ ముందుకు వచ్చే ఆయన.. ఈ మధ్య తెలుగు సినిమాలకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. తాజాగా మరో తెలుగు దర్శకుడితో ఓ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలిసింది.

దుల్కర్ అంటే లవర్ బాయ్​గా స్పెషల్ ఇమేజ్​ ఉంది. ఇప్పుటికే ఆయన ఎన్నో ప్రేమ కథలో నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు తన మరో కొత్త తెలుగు సినిమా కూడా ప్రేమ కథాంశంతోనే రాబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమాతో రవి అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారట. ఈయన గతంలో దర్శకుడు పరశురామ్​ దగ్గర అసిస్టెంట్​గా పని చేశారని తెలిసింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్​ సంగీతం అందించనున్నారని సమాచారం. ఎస్​ఎల్​వీ సినిమాస్​ బ్యానర్​పై సుధాకర్ చేకూరి సినిమాను నిర్మించబోతున్నారట.

ఈ సినిమా షూటింగ్​ను ఫారెన్​లో కూడా చిత్రీకరించాలని మూవీటీమ్​ డిసైట్​ అయినట్లు తెలిసింది. సగం చిత్రాన్ని యూఎస్​లో షూట్ చేస్తారట. మిగతా సగం స్వదేశంలోనే చిత్రీకరించనున్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్​ అనౌన్స్ మెంట్​ రానుంది. ఇకపోతే ఇప్పటికే దుల్కర్ సీతారమం తర్వాత​ తెలుగులో రెండు ప్రాజెక్ట్​లను చేస్తున్నారని తెలిసింది.

అందులో ఒకటి.. రీసెంట్​గా 'సార్‌'తో సూపర్‌ హిట్‌ అందుకున్న వెంకీ అట్లూరితో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను చేస్తున్నట్లు దుల్కర్ అధికారికంగా​ తెలిపారు. 'లక్కీ భాస్కర్‌' టైటిల్​తో రానున్న ఈ సినిమా పోస్టర్‌ ఆధారంగా చూస్తే డబ్బు చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది. ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్​పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఇంకా నేషనల్‌ అవార్డు విజేత నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. మరో సినిమా గురించి వివరాలు క్లారిటీగా తెలీదు.

ఇకపోతే దుల్కర్‌ రీసెంట్​గా.. తన చిన్ననాటి మిత్రుడైన అభిలాష్‌ జోషిలీ దర్శకత్వంలో 'కింగ్‌ ఆఫ్‌ కోథా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అలాగే రాజ్‌ అండ్ డీకే దర్శకత్వంలో గన్స్‌ అండ్ గులాబ్స్‌ అనే వెబ్​సిరీస్​తో ఆడియెన్స్​ను పలకరించారు. నెట్​ఫ్లిక్స్​ వేదికగా స్ట్రీమింగ్​ అవుతున్న ఈ సిరీస్​ బాగానే ఉంది.

Tags:    
  • Dulquersalmaan 
  • Mahanatimovie 
  • Sitaramammovie 
  • Telugumovies 
  • Dulquer 
  • Directorravi 
  • Filmindustry 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS