దుల్కర్ 'కాంత' టీజర్ చూశారా? సంథింగ్ స్పెషల్ గా ఉందే!
పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రూపొందుతున్న ఆ మూవీలో భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్ గా నటిస్తున్నారు.;
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. పేరుకే మలయాళ హీరో కానీ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ స్ట్రెయిట్ హీరోలతో సమానంగా ఫేమ్ దక్కించుకున్నారు. ఇప్పటికే మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఆయన.. ఇప్పుడు కాంత మూవీలో యాక్ట్ చేస్తున్నారు.
పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రూపొందుతున్న ఆ మూవీలో భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. టాలీవుడ్ హల్క్ రానా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సెల్వమణి దర్శకత్వం వహిస్తుండగా.. సురేష్ ప్రొడక్షన్స్, వేఫారేర్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారని సమాచారం. అదే సమయంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే దుల్కర్ తోపాటు సముద్ర ఖని ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు టీజర్ ను విడుదల చేశారు. దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ ఇచ్చారు.
ఇప్పటికే ఇచ్చిన అప్డేట్స్ తో పాటు టీజర్ బట్టి చూస్తే.. 1960స్ కు చెందిన స్టార్ హీరోగా దుల్కర్ సినిమాలో కనిపించనున్నారు. సముద్రఖని ఓ నిర్మాతగా తెలుస్తోంది. వీళ్లిద్దరు కలిసి పలు సినిమాలు చేస్తారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోతారు. అయితే సముద్ర ఖని రూపొందించే శాంత అనే హారర్ మూవీలో దుల్కర్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తారు.
అయితే ఆ సినిమా టైమ్ లో దుల్కర్- సముద్రఖని మధ్య ఏం జరిగింది? ఎందుకు గొడవలు వచ్చాయి? అనేది కాంత సినిమాగా తెలుస్తోంది. ఇప్పుడు టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమ్ థింగ్ డిఫరెంట్ మూవీలా ఉండబోతుందనే ఫీల్ ను టీజర్ క్రియేట్ చేసిందని నెటిజన్లు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు.
దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ తో ఎప్పటిలానే ఇంప్రెసివ్ గా కనిపించారు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. సముద్రఖని నటనతో అదరగొట్టారు. సెల్వమణి మార్క్ కనిపించింది. టేకింగ్ క్లాస్సీ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఝాను చంథర్ నేపథ్య సంగీతం స్పెషల్ అసెట్ గా నిలిచింది. సెప్టెంబరు 12న థియేటర్లలో రిలీజ్ కానున్న మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.