ఆ గ్లామర్ తో ఎవరి కోసం వెయిటింగ్ దివి?

లంగా వోణీలో అచ్చ తెలుగమ్మాయిలా రెడీ అయింది దివి. మట్టి గాజులు వేసుకుని.. సింపుల్ గా హోయలు ఒలికించింది.

Update: 2024-05-07 15:24 GMT

బిగ్ బాస్ బ్యూటీ దివి అందం గురించి ఎవరు ఎంత వర్ణించినా తక్కువే. గ్లామర్ ను ఆమె వడ్డించే తీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ గుర్తింపు పొందింది దివి. అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హౌస్ లో తన అందం, ఆట తీరుతో తెలుగు సినీ ప్రియులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది.

 

ఇప్పుడిప్పుడే దివికి సినిమా అవకాశాలు బాగా వస్తున్నాయి. మంచి ఆఫర్ వస్తే, సినిమా కథ నచ్చితే ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా యాక్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. దివి చివరిగా లంబసింగి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఓవైపు సినిమాలు, షోలు, డ్యాన్స్ వీడియోలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది.

 

ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ.. కుర్రకారు మతులు పోగొడుతుంటోంది. తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్లను షేర్ చేస్తుంటోంది. ఒంపు సొంపులతో.. అదిరిపోయే స్ట్రక్చర్ తో కుర్రాళ్ల కళ్లను తన వైపు తిప్పుకుంటోంది ఈ అమ్మడు. తాజాగా దివి షేర్ చేసిన కొత్త ఫోటోలు నెట్టింట సెగలు రేపుతున్నాయి. పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Read more!

 

లంగా వోణీలో అచ్చ తెలుగమ్మాయిలా రెడీ అయింది దివి. మట్టి గాజులు వేసుకుని.. సింపుల్ గా హోయలు ఒలికించింది. ఈ మధ్య ఇలా కూడా పిలుస్తున్నారంటూ క్రేజీగా క్యాప్షన్ ఇచ్చింది. బాల్కనీలో కూర్చుని అందాలు ఆరబోసింది. రకరకాల పోజులతో సందడి చేసింది. నడుము చూపిస్తూ హీట్ పుట్టించింది. పైటను కప్పుకుంటూ కొంటెగా పోజులిచ్చింది. వయ్యారంగా నిల్చుని ఓ రేంజ్ లో సెగలు పుట్టించింది. అందానికి ఇమేజ్ తానే అనేలా అదరగొట్టింది.

ఇక కొత్త పిక్స్ లో దివి నేచురల్ గా, ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లైకులు కొడుతూ, షేర్లు చేస్తూ దివి ఫోటోలు నెట్టింట ఫుల్ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ముద్దుగుమ్మ అందాల విందుకు అల్లాడిపోతున్నట్లు చెబుతున్నారు. ఏమా అందం దివి అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా దివి పిక్స్ ఉన్నాయని రచ్చరచ్చ చేస్తున్నారు. మరి దివి పిక్స్ ను మీరు చూశారా?

Tags:    

Similar News