స్వర్గానికి దారి చూపిస్తానంటున్న దివి.. జిమ్ అవుట్ ఫిట్ తో సెగలు పుట్టిస్తూ!
ఒకవైపు గ్లామర్ తో కట్టిపడేస్తూనే.. మరొకవైపు సాంప్రదాయంగా కనిపిస్తూ తెలుగు కుర్రాల హృదయాలను దోచుకుంటోంది ఈ చిన్నది .
బుల్లితెర అయినా.. వెండితెర అయినా.. అందంతో ఆకట్టుకోవడానికి సెలబ్రిటీలు ఎప్పుడూ ముందుంటారు. అలా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ వలకబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. మరి కొంతమంది కట్టు బొట్టుతో సాంప్రదాయంగా కనిపిస్తూ అభిమానులను రెచ్చగొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరొక బ్యూటీ స్వర్గానికి దారి చూపిస్తానంటూ అందాలతో అదరగొట్టే ప్రయత్నం చేసింది. ఆమె ఎవరో కాదు అందాల తార, అభినయ సుందరి దివి.
జిమ్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టించిన దివి..
ఒకవైపు గ్లామర్ తో కట్టిపడేస్తూనే.. మరొకవైపు సాంప్రదాయంగా కనిపిస్తూ తెలుగు కుర్రాల హృదయాలను దోచుకుంటోంది ఈ చిన్నది . ఈసారి కాస్త భిన్నంగా జిమ్ సెంటర్ నుండి సెగలు పుట్టిస్తూ.. జిమ్ ఔట్ఫిట్ లో కొన్ని ఫోటోలు షేర్ చేయడమే కాకుండా స్వర్గానికి దారి చూపిస్తా నాతో వచ్చేయ్ అంటూ క్యాప్షన్ జోడించి, అందరిని ఆకట్టుకుంది. ఇక తాజాగా జిమ్ సెంటర్ నుండి కొన్ని ఫోటోలు షేర్ చేసిన దివి.. అందులో జిమ్ అవుట్ ఫిట్ ధరించి మెస్మరైజ్ చేసింది. ఒకవైపు కష్టపడుతూ బరువులు మోసేస్తూ.. మరొకవైపు తన అందాలతో గిలిగింతలు పెట్టింది. ఓవరాల్గా ఈ జిమ్ అవుట్ ఫిట్ లో అమ్మడి అందానికి సోషల్ మీడియాలో మంటలు రాజుకుంటున్నాయి.
దివి సినీ ప్రస్థానం..
1996 మార్చి 15న హైదరాబాదులో శశికాంత్ వైద్య, దేవకీ దంపతులకు జన్మించిన ఈమె.. పదవ తరగతి వరకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో తన స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. ఆ తర్వాత జి.నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎంబీఏ పూర్తి చేసిన ఈమె.. 2017లో మోడలింగ్ రంగంతో తన కెరీర్ ను ఆరంభించింది. అలా పలు ఫ్యాషన్ సంస్థలకు మోడలింగ్ కూడా చేసింది. అలా మోడల్ గా పనిచేస్తున్న సమయంలో 2018లో లెట్స్ గో అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా నటిగా అవకాశం అందుకున్న ఈమెకు.. 2019లో వచ్చిన మహర్షి సినిమా నటిగా ప్రాణం పోసింది. అలా ఈ సినిమాతో తన నటనతో ప్రూవ్ చేసుకున్న దివి 2019లో ఏ వన్ ఎక్స్ప్రెస్ , 2021లో క్యాబ్ స్టోరీస్ వంటి చిత్రాలతో తన ఉనికిని చాటుకుంది.
దివి బిగ్ బాస్ ప్రయాణం..
అలా సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సమయంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో అవకాశం లభించింది. అయితే హౌస్ లోకి వచ్చిన ఈమె 49 రోజుల పాటు హౌస్ లో కొనసాగి, ఆ తర్వాత హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఇక బిగ్ బాస్ తో వచ్చిన గుర్తింపును ఉపయోగించుకొని.. రుద్రంగి, గాడ్ ఫాదర్ , జిన్నా, నయీమ్ డైరీస్, లంబసింగి , సింబ వంటి చిత్రాలలో నటించింది. పుష్ప 2 లో రిపోర్టర్ గా పనిచేసిన ఈమె 2025లో చివరిగా డాకు మహారాజ్ సినిమాలో ఝాన్సీ పాత్రతో అదరగొట్టేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇలా గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.