డిస్నీలో లే ఆఫ్స్.. రీజన్ ఏంటంటే
మార్చిలో డిస్నీ తన ABC న్యూస్ గ్రూప్ మరియు డిస్నీ ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్స్ నుంచి దాదాపు 200 మంది ఉద్యోగులకు వేటు వేసింది.;
వాల్ట్ డిస్నీ అనేక విభాగాల్లో వందల మంది ఉద్యోగులను తొలగిస్తుంది. అయితే వారంతా సినిమా, టెలివిజన్, కార్పోరేట్ ఫైనాన్స్ విభాగాల్లో పని చేసేవారే. ఈ లే ఆఫ్స్ సినిమా మరియు టీవీ మార్కెటింగ్, పబ్లిసిటీ, క్యాస్టింగ్ సెలక్షన్, మరియు డెవలప్‌మెంట్ లాంటి వాటిపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. తన బిజినెస్ స్ట్రాటజీని అడ్జస్ట్ చేసుకోవడానికే డిస్నీ ఈ లే ఆఫ్స్ నిర్ణయం తీసకున్నట్టు తెలుస్తోంది.
అందరూ కేబుల్ సేవల నుంచి స్ట్రీమింగ్ సేవలకు మారుతున్న నేపథ్యంలో డిస్నీ కూడా దానికి తగ్గట్టే తమ బిజినెస్ ను మార్చుకోవాలని ప్రయత్నిస్తూ అందులో భాగంగానే ఈ డెసిషన్ తీసుకుందని సమాచారం. ఇప్పటికే 2023లో డిస్నీ 7000 ఉద్యోగాలను తొలగించి దాని వల్ల 5.5 బిలియన్ డాలర్ల ఖర్చును తగ్గించుకుంది. రీసెంట్ గా కూడా డిస్నీ మరోసారి లే ఆఫ్స్ ను విధించింది.
మార్చిలో డిస్నీ తన ABC న్యూస్ గ్రూప్ మరియు డిస్నీ ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్స్ నుంచి దాదాపు 200 మంది ఉద్యోగులకు వేటు వేసింది. అయితే ఇన్ని కోతలు ఉన్నప్పటికీ డిస్నీలోని స్ట్రాంగ్ థీమ్, మంచి టీమ్ వల్ల డిస్నీ మే ఆదాయ నివేదిక వాల్ స్ట్రీట్ అంచనాలను మించిపోతూనే ఉంది. మే నివేదిక తర్వాత డిస్నీ షేర్లు 21% పెరిగినప్పటికీ సోమవారం వాటి విలువ 112.95 డాలర్ల వద్ద కొద్దిగా తగ్గాయి.