పొట్టి ఫ్రాకులో నిప్పు పెట్టిన ప‌టానీ

ఇప్పుడు ఒక భారీ భ‌వంతి సెల్లార్ లో, పార్కింగ్ ప్లేస్ లో ఫైర్ ఎక్విప్‌మెంట్ ప‌రిస‌రాల్లో గోడ‌ను ప‌ట్టుకుని దిశా ఫోజులిచ్చింది.;

Update: 2025-04-25 15:28 GMT

సీకే బ్యూటీ దిశా పటానీ ఎక్క‌డ ఉన్నా.. ఏం చేసినా.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఏదైనా ఈవెంట్ కి వెళ్లినా, బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ కి వెళ్లినా లేదా రెస్టారెంట్, జిమ్ యోగా సెంట‌ర్.. ప్లేస్ ఏదైనా అక్క‌డ దిశా చుట్టూ కెమెరా క‌ళ్లు వెంటాడుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక భారీ భ‌వంతి సెల్లార్ లో, పార్కింగ్ ప్లేస్ లో ఫైర్ ఎక్విప్‌మెంట్ ప‌రిస‌రాల్లో గోడ‌ను ప‌ట్టుకుని దిశా ఫోజులిచ్చింది.

ఒక ర‌కంగా పొట్టి ఫ్రాకులో నిప్పు పెట్టింది ఈ బ్యూటీ. ప‌సుపు రంగు డిజైన‌ర్ ఫ్రాక్ లో థై సొగ‌సుల్ని ఎలివేట్ చేస్తూ అదిరిపోయే ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. దిశా ఈ కొత్త లుక్ లో స్ట‌న్నర్! అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. యూత్ దిశా నాజూకు సొగ‌సును ప్ర‌శంసిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్‌కి వ‌స్తే.. దిశా ప‌టానీ ఇటీవ‌లే `క‌ల్కి 2898 ఏడి`లో ఒక ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించింది. అటు త‌మిళంలో సూర్య `కంగువ‌`లోను దిశా న‌టించిన సంగతి తెలిసిందే. ప్ర‌భాస్ ఈ బ్యూటీకి భారీ విజ‌యాన్ని అందిస్తే, సూర్య బిగ్ ఫ్లాప్ ని ఇచ్చాడు. తదుప‌రి ప్రాజెక్టుల గురించి దిశా స్వ‌యంగా వెల్ల‌డించాల్సి ఉంది.

Tags:    

Similar News