బ్లాక్ డ్రెస్ లో హీట్ పెంచిన దిశా పటాని.. ఫోటోలు వైరల్!

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటాని అత్యంత స్టైలిష్ నటీమణులలో ఒకరని మరోసారి నిరూపించుకుంది.;

Update: 2025-10-18 20:30 GMT

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటాని అత్యంత స్టైలిష్ నటీమణులలో ఒకరని మరోసారి నిరూపించుకుంది. తాజాగా దిశాపటాని ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. రీసెంట్గా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో దిశాపటాని బ్లాక్ కలర్ షీర్ కార్సెట్ డ్రెస్ ధరించి అందర్నీ ఆకర్షించింది. దిశా పటాని అందం ఆ డ్రెస్ లో మరింత అద్భుతంగా కనిపించడమే కాకుండా చాలామందిని అసూయపడేలా చేసింది.. తన సిగ్నేచర్ స్మైలింగ్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం దిశా పటానికి సంబంధించిన ఈ బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉండే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దిశా పటాని బ్లాక్ కలర్ లేస్ కార్సెట్ ని ధరించి ఆమెలో ఉన్న బోల్డ్ నెస్ ని మరోసారి బయట పెట్టింది..

దిశా పటాని తన బోల్డ్ నెస్ కి అనుగుణంగా ఉండే ఫిట్టెడ్ సిల్హాట్ తో పెయిర్ చేసిన షీర్ ఫ్యాబ్రిక్ డ్రెస్ ని వేసుకుంది. అలాగే గోల్డ్ చైన్ మినీ బ్యాగ్ ని వేసుకొని కర్లీ హెయిర్ తో సింపుల్గా తన లుక్ ని కంప్లీట్ చేసింది. అలా దిశపటాని బోల్డ్ దుస్తులు వేసుకున్నప్పటికీ అక్కడ ఉన్న వారితో మాట్లాడేటప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో చిరునవ్వుతో పలకరించింది. ప్రస్తుతం దిశా పటానీకి సంబంధించిన ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది అభిమానులు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ దిశా పటాని అంటేనే హాట్ నెస్ కి నిర్వచనం లాంటిది.. ఇలాంటి డ్రెస్ లకు దిశా పటానీ మాత్రమే అర్హురాలు అన్నట్లుగా కామెంట్లు పెడుతున్నారు.. అలా ఎప్పుడూ పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ హాట్ ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది దిశా పటాని.

ఈ హీరోయిన్ సినిమాల విషయానికి వస్తే.. దిశా పటాని మొదట సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.తెలుగు సినిమా ద్వారానే.. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ మూవీతో 2015లో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ అనే సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అలా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఎక్కువ గుర్తింపు మాత్రం బాలీవుడ్ సినిమాల ద్వారానే తెచ్చుకుంది. అలా బాలీవుడ్ లో ఈ హీరోయిన్ నటించిన భాగి-2, రాధే,యోధ,మలంగ్ వంటి సినిమాలు పేరు తెచ్చిపెట్టాయి.

గత ఏడాది దిశా పటాని బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి కల్కి 2898 AD మూవీలో ఒక కీ రోల్ పోషించింది. దిశాపటాని అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే ..వెల్కమ్ టు ద జంగిల్,మలంగ్ మూవీకి సిక్వెల్ గా వస్తున్న మలంగ్-2 వంటి బాలీవుడ్ సినిమాలతో పాటు తమిళంలో ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News