• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బేబీ డైరెక్టర్...

బేబీ డైరెక్టర్ భయపడుతున్నాడా..?

| దీంతో, మరింత గా ట్రోల్ చేస్తారేమో అనే కారణంతోనే ఆయన తన ఎకౌంట్ ని తీసేశారని, ఆ విషయంలో సాయి రాజేష్ భయపడుతున్నాడని కొందరు అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2023-08-21 12:45 GMT

ఈ మధ్యకాలంలో విడుదలై, సంచలనం సృష్టించిన సినిమా బేబీ. చిన్న సినిమాగా విడుదలై ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీ హిట్ కావడమే కాదు, కాసుల వర్షం కూడా కురిపించింది. ఈ మూవీ చూడటానికి ప్రేక్షకులు క్యూలు కట్టారు. చాలా మంది ఈ సినిమాలో తమ కథను ఓన్ చేసుకొని మరీ చూశారు. అందుకే అంత క్లిక్ అయ్యింది.

ఈ మూవీ తర్వాత ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ ని ఘోరంగా తిడుతూ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నిజానికి మీమర్స్ కారణంగా కూడా ఈ మూవీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. థియేటర్ లో ఇంత హిట్ అయిన ఈ సినిమా ని ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. ఈ నెల 25 న ఈ మూవీ ఓటీటీకి రానుంది.

ఈ క్రమంలో డైరెక్టర్ సాయి రాజేష్ షాకింగ్ స్టెప్ తీసుకున్నారు. ఆయన ట్విట్టర్ లో తన ఎకౌంట్ ని డీ యాక్టివేట్ చేశారు. ఆయన సడెన్ గా ఇలా ఎందుకు చేశారా అనేది ఇప్పుడు అందరినీ షాకింగ్ కి గురి చేసింది. అయితే, దీనికి కారణం ఉందని కొందరు అంటున్నారు. మూవీ ఓటీటీలో వస్తున్న కారణం చేతే ఆయన ట్విట్టర్ లో డీ యాక్టివ్ అయ్యారని వారు చెబుతున్నారు.

ఈ మూవీ రిలీజ్ అయిన సమయంలో కొన్ని డైలాగుల విషయంలో డైరెక్టర్ ని విమర్శించిన వారు కూడా ఉన్నారు. ఇక ఓటీటీలో థియేటర్ లో కట్ చేసిన సీన్స్ ని కూడా యాడ్ చేసి విడుదల చేస్తున్నారట.

ఆ సీన్స్ థియేటర్ లో చూసిన వాటికంటే మరింత బోల్డ్ గా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో, మరింత గా ట్రోల్ చేస్తారేమో అనే కారణంతోనే ఆయన తన ఎకౌంట్ ని తీసేశారని, ఆ విషయంలో సాయి రాజేష్ భయపడుతున్నాడని కొందరు అంటున్నారు. అసలు కారణం ఏంటి అనేది మాత్రం తెలియలేదు.

అయితే, ఆయన కేవలం ట్విటర్ లోనే ఎకౌంట్ ఇన్ యాక్టివ్ చేశాడు. ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండటం విశేషం. ఇన్ స్టా లో ఆయనే స్వయంగా ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ ని షేర్ చేశారు. ఇక ఈ మూవీలో వైష్ణవి చైతన్య లీడ్ రోల్ చేశారు. ఆనంద్ దేవర కొండ, విరాజ్ అశ్విన్ లు హీరోలుగా నటించారు. థియేటర్ లోనే ఇంత హిట్ అయిన ఈ సినిమా, ఓటీటీలో మరెంత అదరగొట్టనుందో చూడాలి.

Tags:    
  • Babymovie 
  • Sairajesh 
  • Baby 
  • Twitter 
  • Ott 
  • Theatrical 
  • Movie 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS