3.5 లక్షల చీటింగ్ కేసులో నటుడి అరెస్ట్!
కానీ ఇక్కడ ఒక సినీ నటుడు 3.5 లక్షల చిల్లర కోసం కక్కుర్తి పడటం, అమాయకులపై మోసానికి పాల్పడి అరెస్టవ్వడం చర్చనీయాంశంగా మారింది.;
రెవెన్యూ ఆఫీసర్లు, ఆదాయపన్ను శాఖ అధికారులు లేదా భూముల రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు .. వీరంతా అక్రమార్జనతో కోట్లకు కోట్లు కొల్లగొట్టారని మీడియాలో కథనాలు రావడం చూస్తున్నాం. ఆదాయపన్ను శాఖ రైడ్స్ లో అధికారుల బెడ్ రూముల్లో పరుపులు, బాత్రూముల గోడలు చీల్చి నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్న వార్తలు వింటుంటే విస్తుపోకుండా ఉండలేము.
కానీ ఇక్కడ ఒక సినీ నటుడు 3.5 లక్షల చిల్లర కోసం కక్కుర్తి పడటం, అమాయకులపై మోసానికి పాల్పడి అరెస్టవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ భోజ్‌పురి నటుడు,యూట్యూబర్ దిలీప్ కుమార్ సాహు ఇటీవల రూ. 3.5 లక్షల క్రెడిట్ కార్డ్ మోసం కేసులో అరెస్టు అయ్యాడు. యూపీ సైబర్ పోలీసులు దిలీప్‌ను పట్టుకుని ముంబైకి తీసుకువెళ్లి విచారించగా అతడు వేరొకరి కార్డ్ ని స్వైప్ చేసి 3.5 లక్షలు విత్ డ్రా చేసాడని తేలింది. అతడిని నమ్మి కార్డ్ ఇచ్చిన వ్యక్తిని దారుణంగా మోసం చేసాడు. తన పోస్టర్ పంపి వాట్సాప్ చాట్ చేసి ముంబైకి చెందిన డ్రైవర్ ని మోసం చేసాడు. ముంబై శివారు ప్రాంతాల్లో నటుడు దిలీప్ పలుమార్లు ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.
నటుడిగా గొప్ప ఆదరణ ఉంది.. యూట్యూబర్ గా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయినా అతడు ఇలాంటి చిల్లర కేసులో దొరికిపోయి చివరికి పరువు తీసుకున్నాడు. స్వల్పకాలిక అవసరాలకు క్రెడిట్ కార్డులోను డబ్బును డ్రా చేసుకునే ఫెసిలిటీ బ్యాంకులు కల్పించడంతోనే ఈ తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయి.