దిల్ రాజు కొత్త మూవీస్.. లైనప్ చాలా క్రేజీగా ఉందే!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆయన.. ఇప్పుడు అగ్ర నిర్మాతగా మారారు. దిల్ మూవీతో ప్రొడ్యూసర్ గా ఆయన.. ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆడియన్స్ కు అందించారు. హిట్స్ అందుకున్నారు.
కొన్నేళ్ల క్రితం స్థాపించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇప్పటికే బోలెడు సినిమాలు తెరకెక్కించిన దిల్ రాజు.. కొన్ని రోజుల క్రితం దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థను కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గా దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ ను కొత్త తరం నటీనటులను పరిచయం చేసేందుకు ఆయన స్టార్ట్ చేశారు. త్వరలో ఫస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనున్నారు.
అయితే వెంకటేశ్వర క్రియేషన్స్ తో పాటు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ల లైనప్ లో అనేక సినిమాలు చేర్చారు దిల్ రాజు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో తమ్ముడు మూవీతో సందడి చేయనుండగా.. ఇంకా కొన్ని ప్రాజెక్ట్ ల షూటింగ్స్ ను త్వరలో మొదలుపెట్టనున్నారు. మరికొన్ని సినిమాలు ఫిక్స్ చేస్తున్నారు. త్వరలో ప్రకటించనున్నారు.
స్టార్ హీరో విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన మూవీ తీయనున్నారు దిల్ రాజు. రాయలసీమ నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామాగా ఆ సినిమా రూపొందుతున్నట్లు వార్తలు వస్తుండగా.. రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో షూటింగ్ మొదలవ్వనుండగా.. దేవరకొండ తన లుక్ ను మూవీ కోసం మార్చినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో ఇప్పుడు నితిన్ తో తమ్ముడు మూవీ చేసిన దిల్ రాజు.. ఆ తర్వాత ఆయనే హీరోగా ఎల్లమ్మ మూవీ తీయనున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా కోసం నితిన్ సిద్ధమవుతున్నారు. మరోవైపు, మాలీవుడ్ సూపర్ హిట్ మూవీ మార్కో డైరెక్టర్ హనీఫ్ తో ఒక సినిమా చేయనున్నారు దిల్ రాజు.
ఓ యానిమల్ బేస్ట్ మూవీ కూడా తీయనున్నారు. అందులో స్టార్ హీరో యాక్ట్ చేయనున్నారు. వీటితోపాటు జటాయు వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించనున్న సిరీస్ ను.. ఇప్పటికే దిల్ రాజు అనౌన్స్ చేశారు. జటాయు పాత్ర చుట్టూ సిరీస్ ఉండనుంది. ఈ మేరకు తమ్ముడు ప్రమోషన్స్ లో భాగంగా అప్ కమింగ్ ప్రాజెక్టుల గురించి రివీల్ చేశారు.