ఒకప్పటి దిల్ రాజు గుర్తు చేసేలా.. S.V.C పర్ఫెక్ట్ ప్లానింగ్..!

ఈ క్రమంలోనే దిల్ రాజు డ్రీంస్ అంటూ ఒక టాలెంట్ హంట్ పెట్టి అక్కడ నుంచి మంచి కథలను.. డైరెక్టర్స్ ని పిక్ చేసుకుంటున్నాడు.;

Update: 2025-11-08 06:44 GMT

దిల్ సినిమా నుంచి నిర్మాతగా దిల్ రాజు పేరు కనిపిస్తే చాలు ఒక మంచి సినిమా వస్తుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యేవారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మాతగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేశారు. ఐతే ఆ తర్వాత కమర్షియల్ ప్రొడ్యూసర్స్ గా కూడా సినిమాలు చేస్తూ వచ్చారు. ఐతే దిల్ రాజు 50 సినిమాల తర్వాత ట్రాక్ తప్పాడు. స్టార్ సినిమాలు చేస్తున్నా ఎందుకో వర్క్ అవుట్ అవ్వలేదు. అందుకే దిల్ రాజు మరోసారి తన పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు.

ఏడుగురు కొత్త దర్శకులతో దిల్ రాజు..

ఈ క్రమంలోనే దిల్ రాజు డ్రీంస్ అంటూ ఒక టాలెంట్ హంట్ పెట్టి అక్కడ నుంచి మంచి కథలను.. డైరెక్టర్స్ ని పిక్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ దిల్ రాజు ఏడుగురు కొత్త దర్శకులతో సినిమాలు ప్రారంభిస్తాడని తెలుస్తుంది. అంతా కూడా టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ అని తెలుస్తుంది. ఐతే వీటిలో రెండు ఓటీటీ సీరీస్ లుగా రిలీజ్ అవుతాయట. రెండు సినిమాలు మాత్రం యూఎస్ బ్యాక్ డ్రాప్ లో ఉంటాయని తెలుస్తుంది.

సో మిగతా నాలుగు సినిమాలు మాత్రం ఇక్కడ ఉంటాయి. మొత్తానికి దిల్ రాజు రైట్ టైం ఆన్ ట్రాక్ ఎక్కాడని చెప్పొచ్చు. స్టార్ సినిమాలతో సినిమాలు చేస్తూనే మరోపక్క టాలెంట్ ఉన్న వారికి అవకాశం ఇస్తూ వారి సినిమాలను లో బడ్జెట్ లో తీసి హిట్ కొట్టాలని చూస్తున్నారు. దిల్ రాజు కెరీర్ మొదట్లో ఇలానే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసి వరుస హిట్లు కొట్టారు. కానీ స్టార్ సినిమాల బిజీలో పడి కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం ఆపేశారు.

S.V.C బ్యానర్ పూర్వ వైభవం..

ఐతే ఇన్నాళ్లకు మళ్లీ దిల్ రాజు తన బ్యానర్ లో అంతా కొత్త వారితో సినిమాలు చేస్తున్నాడు. వీరు తీసే సినిమాలు మళ్లీ దిల్ రాజు ఎస్.వి.సి బ్యానర్ కి పూర్వ వైభవం తెచ్చి పెడతాయని ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు. ఏడుగురు కొత్త దర్శకులతో దిల్ రాజు బ్యానర్ లో సినిమాలు అంటే తప్పనిసరిగా మెచ్చుకోవాల్సిన అంశం అనే చెప్పొచ్చు. దిల్ రాజు డ్రీంస్ ద్వారా వచ్చిన వారికి కూడా మంచి అవకాశాలు ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఇండస్ట్రీకి కావాల్సిన టాలెంటెడ్ పీపుల్ ని తన ద్వారా పరిచయం చేస్తున్నారు దిల్ రాజు.

దిల్ రాజు బాటలోనే మరికొంతమంది నిర్మాతలు కూడా ఇలానే కొత్త వారిని ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆల్రెడీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి కూడా రైటర్స్ కి ఆహ్వానం అంటూ ఆడిషన్ కాల్ ఇచ్చారు. తప్పకుండా ఇండస్ట్రీలో ఈ కొత్త ప్రతిభ తెలుగు పరిశ్రమకు మరిన్ని సక్సెస్ లు తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News