రౌడీ జనార్ధన, ఎల్లమ్మ.. దిల్ రాజు అప్డేట్ ఏంటంటే?

కథల ఎంపికలో ఆయన రూటే వేరని అంతా చెబుతుంటారు. కానీ రీసెంట్ గా దిల్ రాజు లెక్కలు తప్పాయి.;

Update: 2025-11-30 06:46 GMT

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ చేసిన ఆయన.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలు నిర్మించి ఆడియన్స్ ను అలరించారు. వివిధ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న దిల్ రాజు.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

కథల ఎంపికలో ఆయన రూటే వేరని అంతా చెబుతుంటారు. కానీ రీసెంట్ గా దిల్ రాజు లెక్కలు తప్పాయి. నిర్మించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా మారాయి. ఫ్యామిలీ స్టార్, గేమ్ ఛేంజర్, తమ్ముడు అసలు మెప్పించలేకపోయాయి. కేవలం సంక్రాంతికి వస్తున్నాం మూవీ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ గా భారీ వసూళ్లు సాధించింది.

అయితే దిల్ రాజు.. ఇప్పుడు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలనే ప్లాన్ లో ఉన్నారు. అందుకు గాను భారీ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక సినిమాలను లైన్లో పెట్టగా.. వాటిలో కొన్ని చిత్రాల షూటింగ్స్ మొదలయ్యాయి. మరిన్ని సినిమాల చిత్రీకరణలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రీసెంట్ గా దిల్ రాజు.. తన బ్యానర్ పై నిర్మిస్తున్న సినిమాల అప్డేట్స్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. రౌడీ జనార్థన్, ఎల్లమ్మ చిత్రాల కొత్త అప్డేట్స్ ను రివీల్ చేశారు. రౌడీ జనార్థన్ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలైందని తెలిపారు. వచ్చే ఏడాది ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని వెల్లడించారు.

ఆ తర్వాత ఎల్లమ్మ మూవీ త్వరలో మొదలు కానుందని దిల్ రాజు తెలిపారు. ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ఇవ్వనున్నామని చెప్పారు. మరో పది రోజుల్లో అన్ని అప్డేట్స్ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఎల్లమ్మ మూవీ కూడా 2026లో థియేటర్స్ లో రిలీజ్ అవ్వనుందని పేర్కొన్నారు.

అంటే దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చే ఏడాది రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయని క్లారిటీ వచ్చినట్లే. అయితే రౌడీ జనార్ధన్ మూవీలో స్టార్ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ పోషిస్తుండగా.. రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. అదే సమయంలో ఎల్లమ్మ సినిమాను వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లీడ్ రోల్ లో నటించనున్నారని వినికిడి.

Tags:    

Similar News