మార్కో ఎఫెక్ట్.. దిల్ రాజు ఇంత గట్టిగా చెబుతున్నారంటే..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో "ఫ్యామిలీ ప్రొడ్యూసర్" అనే పేరు సంపాదించుకున్న దిల్ రాజు ఇప్పుడు ఊహించని ట్రాక్ లోకి అడుగుపెడుతున్నారని తెలుస్తోంది.;

Update: 2025-06-25 04:28 GMT

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో "ఫ్యామిలీ ప్రొడ్యూసర్" అనే పేరు సంపాదించుకున్న దిల్ రాజు ఇప్పుడు ఊహించని ట్రాక్ లోకి అడుగుపెడుతున్నారని తెలుస్తోంది. ఇటీవల "మార్కో" వంటి ఓవర్ వయోలెంట్ సినిమాతో గుర్తింపు పొందిన అనీఫ్ అదేని అనే దర్శకుడితో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారన్న వార్త హాట్ టాపిక్ అయ్యింది. సాధారణంగా ఆయన ఎంచుకునే కంటెంట్‌ను పరిశీలిస్తే ఇది పూర్తిగా విరుద్ధం.

అయితే దీని వెనుక వ్యూహమేంటనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవల “తమ్ముడు” ప్రమోషన్స్‌లో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ “బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలు కమర్షియల్ గా కలెక్షన్స్ తో పాటే గౌరవాన్ని తీసుకస్తాయి. కానీ మార్కో లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ డబ్బు తీసుకురావచ్చు” అని వ్యాఖ్యానించారు.

ఈ మాటల వల్ల ఒక నిర్మాతగా కమర్షియల్ గా, గౌరవం రెండింటిని బ్యాలన్స్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన నమ్ముతున్నట్లు. ఇక ఈ సినిమా కోసం హీరో ఎవరో ఇంకా బయటపెట్టలేదుగానీ, 2026లో షూటింగ్ మొదలుపెట్టి 2027కి రిలీజ్ చేయాలన్నదే అసలు ప్లాన్. ఇప్పటికే మార్కో సినిమా మీద వచ్చిన తీవ్ర విమర్శలూ, హింసాత్మకత పట్ల నార్త్ ఇండియా వరకు వచ్చిన నెగటివిటీ దిల్ రాజుకీ తెలుసు.

అయినా సరే, అనీఫ్ స్టైల్ వైపు మొగ్గు చూపడం వెనుక ఆయన ప్లాన్ గట్టిగానే ఉన్నట్లు అనిపిస్తోంది. ఎస్వీసీ బ్యానర్ మీద కాకుండా, తన కూతురు హర్షిత రెడ్డి నిర్వహిస్తున్న “దిల్ రాజు ప్రొడక్షన్స్” పతాకంపై ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడమే అందుకు కారణం అనిపిస్తోంది. ఇప్పటికే బలగం, లవ్ మీ లాంటి విభిన్న కథలకు ఈ సంస్థ నిలయంగా మారింది.

ఇక గేమ్ ఛేంజర్ లాంటి పెద్ద సినిమాతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న దిల్ రాజు, బోల్డ్ కంటెంట్‌తో అయినా కమర్షియల్ సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో ఇలా మారినట్లు సినీ వర్గాల్లో టాక్. ఈసారి ఫ్యామిలీ ఆడియెన్స్‌ను పక్కనబెట్టి, మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్నారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. చివరికి పాజిటివ్ పబ్లిసిటీతో పాటు డబ్బు కూడా రావాలంటే ఈ మార్గం తప్పదని దిల్ రాజు భావిస్తుండొచ్చు. అయినా ఆయన ప్లానింగ్ చూస్తుంటే, మళ్ళీ ఒకసారి తెలుగు సినిమాకు కొత్త దిశ చూపించే ప్రయత్నంగా అనిపిస్తోంది.

Tags:    

Similar News