పవన్ డేట్ల కోసం దిల్ రాజు.. క్యూలో ఉన్నోళ్లకి షాక్ ఇస్తాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫుల్ బిజీ. రాజకీయాలు, సినిమాలు బ్యాలెన్స్ చేయడం మరింత కష్టమైంది.;

Update: 2025-12-02 09:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫుల్ బిజీ. రాజకీయాలు, సినిమాలు బ్యాలెన్స్ చేయడం మరింత కష్టమైంది. డేట్ల కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ లిస్ట్ లో దిల్ రాజు కూడా ఉన్నారు. అయితే మిగతా వారిలా క్యూలో వెయిట్ చేయడం రాజు గారికి ఇష్టం లేనట్లుంది. అందుకే త్వరగా పని జరిపించుకోవడానికి ఒక బలమైన అస్త్రాన్ని సిద్ధం చేసుకున్నారు. అందరూ ఒక దారిలో వెళ్తుంటే, ఈ బడా నిర్మాత మాత్రం తన పని కోసం ఒక 'షార్ట్ కట్' వెతుక్కున్నారు.

సాధారణంగా పవన్ ను ఒప్పించడం ఇప్పట్లో అయ్యే పని కాదు. చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తవ్వడానికే రెండేళ్లు పడుతుంది. కానీ దిల్ రాజు మాత్రం ఈ గ్యాప్ లోనే దూరిపోవాలని చూస్తున్నారు. దానికోసం నేరుగా పవన్ ను కాకుండా, పవన్ ఎవరి మాటైతే జవదాటరో.. ఆ వ్యక్తిని రంగంలోకి దించుతున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ మధ్యవర్తి తలచుకుంటే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుందని రాజు గారి గట్టి నమ్మకం.

ఆ వ్యక్తి మరెవరో కాదు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. దిల్ రాజు నేరుగా త్రివిక్రమ్ ను కలిసి ఈ బాధ్యత అప్పగించారట. పవన్ తో సినిమా సెట్ చేసి పెట్టమని, తన దగ్గర ఉన్న దర్శకుల లిస్ట్ కూడా గురూజీ చేతిలో పెట్టారని టాక్. పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ అంటే ఎంత ప్రత్యేకమో, ఆ బంధం ఎంత బలమైనదో ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. పవన్ తనకు స్క్రిప్టుల బాధ్యతను పూర్తిగా త్రివిక్రమ్ కే వదిలేశారు.

వాస్తవానికి మైత్రీ మూవీ మేకర్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్, రామ్ తాళ్లూరి వంటి సంస్థలకు పవన్ ఎప్పుడో కమిట్ అయ్యారు. 2027 వరకు డైరీ ఫుల్. కానీ త్రివిక్రమ్ కనుక సీరియస్ గా తీసుకుంటే సీన్ మొత్తం మారిపోతుంది. గురూజీ సూచన మేరకు పవన్ తన లైనప్ మార్చుకుని, దిల్ రాజు ప్రాజెక్ట్ ను ముందుకు తెచ్చే అవకాశం ఉందని దిల్ రాజు గట్టి నమ్మకంతో ఉన్నారు. అలా జరిగితే మిగతా నిర్మాతలకు అది బిగ్ షాక్ గా మారవచ్చు.

ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా చర్చల దశలోనే ఉంది. దిల్ రాజు ప్రపోజల్ కు పవన్ పాజిటివ్ గానే ఉన్నా, ఫైనల్ డెసిషన్ మాత్రం త్రివిక్రమ్ తీసుకుంటారని అర్థమవుతోంది. కథ, దర్శకుడి ఎంపిక అంతా త్రివిక్రమ్ కనుసన్నల్లోనే జరగనుంది. ఇది వర్కవుట్ అయితే క్యూలో ఉన్న మిగతా నిర్మాతలకు గట్టి షాక్ తగిలినట్లే.

సో.. దిల్ రాజు వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఫలిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న జనసేనానిని త్రివిక్రమ్ ఎలా ఒప్పిస్తారో, రాజు గారి కోరికను ఎలా నెరవేరుస్తారో చూడాలి. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఒక క్రేజీ న్యూస్ వినొచ్చు.

Tags:    

Similar News