రణవీర్ 'ధురంధర్'.. ఆ డిస్కషన్ ఏంటి?

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్.. రీసెంట్ గా ధురంధర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2025-12-09 10:08 GMT

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్.. రీసెంట్ గా ధురంధర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా.. డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదలైంది. చాలా ఏళ్ల తర్వాత బీ టౌన్ లో ఎక్కువ నిడివితో వచ్చిన మూవీగా నిలిచింది.

రిలీజ్ కు ముందే సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అవ్వగా.. మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకుంది. కొందరు సినీ ప్రియులు బాగుందని చెబుతుండగా.. మరికొందరు ఓకే యావరేజ్ అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. కానీ టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు వస్తున్నాయి. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు సాధించింది ధురంధర్.

అయితే ఇప్పుడు సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే క్రిటిక్స్ కు, సపోర్టర్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిజానికి ధురంధర్ మూవీని కొందరు విమర్శకులు ప్రోపగాండా మూవీ అని చెప్పగా.. మరికొందరు సినీ క్రిటిక్స్ మాత్రం సినిమా బాగుందని, చిత్రాన్ని బాగా తీశారంటూ ఇప్పటికే కొనియాడారు.

ఇంకొందరు.. బాలీవుడ్ లో ఓపెన్ కల్చర్ ఎక్కువైందని అభిప్రాయపడ్డారు. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. విమర్శకులను ట్రోల్ చేస్తున్నారు. విమర్శకులు తమ అభిప్రాయాలను వెనక్కి తీసుకోవాలంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను బోల్డ్ ప్రెజెంటేషన్ అంటూ ఓపెన్ గా ధురంధర్ మూవీ సమర్థిస్తున్నారు.

ఇంతలో ఓ క్రిటిక్.. సినిమాపై వేరే విధంగా రివ్యూ ఇచ్చారు. దీంతో యాక్టర్ పరేష్ రావల్.. ఆమెను ప్రాముఖ్యత లేని వ్యక్తి అంటూ కామెంట్ చేశారు. దీంతో పరేష్ - క్రిటిక్ సంభాషణ వైరల్ గా మారడంతో నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పరేష్ కు మద్దతు ఇస్తుండగా.. మరికొందరు తప్పుపడుతున్నారు.

పరేష్ ది తప్పుడు ప్రవర్తన అంటూ పలువురు క్రిటిక్స్ మండిపడుతున్నారు. ఆయన ఇప్పటికే నటించిన కొన్ని సినిమాలు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. దీంతో ధురంధర్ చుట్టూ మాటల యుద్ధం నడుస్తోంది. మొత్తానికి సోషల్ మీడియాలో ధురంధర్ కేవలం సినిమాగా మాత్రమే కాకుండా ఒక నేషనల్ డిబేట్ గా మారిందని చెప్పాలి. సినిమా వసూళ్ళ పరంగా కాకుండా డిస్కషన్ల పరంగా వార్తల్లో నిలుస్తోంది!

Tags:    

Similar News