2000 కోట్లు ఆ సినిమాకు నల్లేరు మీద నడకేనా?
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద `ధురందర్ 2` సృష్టిస్తోన్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. విడుదలైన నాలుగు రోజు ల్లోనే ప్రపంచవ్యాప్తంగా 761 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.;
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద `ధురందర్ 2` సృష్టిస్తోన్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. విడుదలైన నాలుగు రోజు ల్లోనే ప్రపంచవ్యాప్తంగా 761 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ స్థాయి ఓపెనింగ్స్ చూస్తుంటే? ఈ సినిమా 2000 కోట్ల క్లబ్‌లో చేరడం అన్నది నల్లేరు మీద నడక లాంటిదేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే.. గతంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన `దంగల్`, `బాహుబలి 2`, `ఆర్ఆర్ఆర్`, `పుష్ప`2 వంటి చిత్రాల గణంకాలను పరిశీలిస్తే `ధురందర్ 2` వేగం వాటికంటే ఎంతో ఎక్కువగా ఉంది.
మొదటి వారంలోనే ఈ స్థాయిలో వసూళ్లు రావడం అనేది అసాధారణమైన విషయం. నార్త్ ఇండియాలోనే కాదు సౌత్ మార్కెట్ సహా ఓవర్సీస్‌లో కూడా `ధురంధర్ 2` ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే జోరు ఇలాగే కొనసాగితే రెండో వారం ముగిసేసరికి 1500 కోట్ల మార్కును సునాయాసంగా దాటే అవకాశం ఉంది. ఆదిత్య ధర్ రూపొందించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో రణవీర్ సింగ్ నటన , సాంకేతిక విలువలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో రిలీజ్ అయిన చిత్రం ఇండియన్ ఆడియన్స్‌నే కాకుం డా అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.
సాధారణంగా పెద్ద సినిమాలకు రెండో రోజు నుంచి వసూళ్లు తగ్గుతాయి. కానీ `ధురందర్ 2` విషయంలో రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతుండటం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తోంది. 2000 కోట్ల లక్ష్యం అనేది ఇంతవరకు భారతీయ సినిమాకు ఓ కలగానే ఉంది. `దంగల్` సాధించినా? అది చైనా వసూళ్లతో కలిపి లెక్క చెప్పాల్సిన పరిస్థితులు. ఆ సినిమా ఇండియా కంటే చైనాలో ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాలో ఎమోషన్ చైనా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవ్వడంతోనే అక్కడ వసూళ్లు పెరిగాయి. అయితే `ధురంధర్ 2` భారతీయ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన చిత్రం.
ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్, రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల నుంచి పోటీ లేకపోవడం వంటివి `ధురంధర్ 2`కి పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. లాంగ్ రన్‌లో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. కలగా మారిన 2000 కోట్ల వసూళ్లను `ధురంధర్ 2` చేధిస్తుందనే అంచనాలు అంతకంతకు బలపడుతున్నాయి. అదే జరిగితే భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరో మెట్టు ఎక్కించడం ఖాయంగా చెప్పొచ్చు. యుద్దం కారణంగా కొన్ని దేశాల్లో సినిమా రిలీజ్ అవ్వని సంగతి తెలిసిందే. అక్కడా రిలీజ్ అయితే వసూళ్లు కలిసొచ్చేవి.