ధనుష్‌ రాజకీయాల్లోకి వస్తే నా మద్దతు...!

ఆ క్రమంలోనే తమిళ్‌ హీరో ధనుష్‌ సైతం రాజకీయాల్లో తన అదృష్టం ను పరీక్షించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది తమిళనాట జరుగుతున్న చర్చ.

Update: 2026-08-21 08:24 GMT

తమిళ్‌ సూపర్ స్టార్‌ విజయ్‌ రాజకీయాల్లో అడుగు పెట్టి సంచలనం సృష్టించాడు. కనీసం గౌరవప్రదమైన సీట్లు అయినా దక్కించుకుంటాడా అనే అనుమానాలు వ్యక్తం చేసిన వారు ముక్కున వేలు వేసుకునే విధంగా ఏకంగా అధికారం ను దక్కించుకున్నాడు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రస్తుతం విజయ్‌ దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. విజయ్‌ను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని ఎంతో మంది స్టార్స్‌ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. తమిళనాట రాజకీయాల్లో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు చక్రం తిప్పడం ఇదేం మొదటి సారి కాదు, కనుక ముందు ముందు కూడా చాలా మంది స్టార్స్ రాజకీయాల్లో తమ అదృష్టం పరీక్షించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే తమిళ్‌ హీరో ధనుష్‌ సైతం రాజకీయాల్లో తన అదృష్టం ను పరీక్షించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది తమిళనాట జరుగుతున్న చర్చ.

ధనుష్‌ పొలిటికల్‌ ఎంట్రీ గురించి...

ధనుష్‌ ప్రస్తుతం హీరోగా ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఏడాదికి మరే ఇతర హీరోలకు సాధ్యం కాని విధంగా రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. ఒక వైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరో వైపు దర్శకత్వం, ప్రొడక్షన్‌ చూసుకుంటూ, స్వచ్చంద కార్యక్రమాలు సైతం చేస్తూ ఉంటాడు. ధనుష్‌ రాజకీయాలపై ఆసక్తి కలిగి ఉన్నాడంటూ గతంలోనే ప్రచారం జరిగింది. రజనీకాంత్‌ అల్లుడిగా ఉన్న సమయంలోనే ధనుష్‌ రాజకీయాల్లో అడుగు పెడతాడని, మామ రజనీకాంత్‌ను ముందు నడిచి ధనుష్ వెనుక ఉండి రాజకీయం చేయాలి అనుకుంటున్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇటీవల ధనుష్ రాజకీయం గురించి, ఆయన పొలిటికల్‌ ఎంట్రీ గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. ఇలాంటి సమయంలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ధనుష్ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు తెర తీసినట్లు అయింది.

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌ మాట్లాడుతూ...

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధనుష్‌ తో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. నా జీవితంలో అత్యంత సన్నిహితుడు, మిత్రుడు ధనుష్ అంటూ జీవీ ప్రకాష్ పేర్కొన్నాడు. అంతే కాకుండా ధనుష్‌ ఏ పని చేసినా నా పూర్తి మద్దతు ఆయనకు ఉంటుంది. ఆయన రాజకీయాల్లో అడుగు పెడితే తప్పకుండా నా పూర్తి మద్దతు ఉంటుంది. ఆయనకు ఒక మిత్రుడిగా వెంట ఉండి నడిచేందుకు రెడీగా ఉన్నాను అన్నాడు. జీవీ ప్రకాష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ధనుష్‌ రాజకీయ అరంగేట్రం గురించి చర్చకు తెర తీశాయి. ప్రస్తుతానికి ధనుష్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఉండక పోవచ్చు. కానీ భవిష్యత్తులో తప్పకుండా ధనుష్ రాజకీయం చేసే ఆలోచన ఉన్నట్లు మాత్రం అనిపిస్తుంది. హీరోగా ధనుష్ ఇంకా పదేళ్ల వరకు వరుస సినిమాలు చేసి అభిమానులను అలరించే అవకాశాలు ఉన్నాయి.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్‌ మళ్లీ...

విజయ్‌ ఇప్పుడిప్పుడే రాజకీయంగా అడుగులు వేస్తున్నాడు. ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన సమయంలో మరో సినీ స్టార్‌ రాజకీయాలకు అవసరం అవుతుంది. అప్పుడు ధనుష్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనేది కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ధనుష్‌ ఇప్పటికి ఇప్పుడు పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వకున్నా 2035 వరకు పార్టీ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ఆయన సన్నిహితులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్న మాట. అయితే అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏ మలుపు తిరుగుతాయి అనేది చెప్పలేని పరిస్థితి. కనుక ధనుష్‌ రాజకీయ ఎంట్రీ గురించి వస్తున్న ఊహాగాణాలు ప్రస్తుతం గాల్లో మేడలు, నీటి మూటలు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ధనుష్‌ పూర్తి దృష్టి ప్రస్తుతం సినిమాలపైనే ఉంది, ఆయన ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో యాక్టింగ్‌, డైరెక్షన్‌, ప్రొడక్షన్‌ చూసుకుంటున్నాడు. మరోసారి వెంకీ అట్లూరి తో ధనుష్ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా మాత్రమే కాకుండా ధనుష్ లైనప్‌ లో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. వచ్చే ఏడాది వరకు ధనుష్ బిజీ బిజీగా ఉండబోతున్నారు.

Tags:    

Similar News