ధనుష్ 'కుబేర'.. తమిళనాడు సంగతేంటి?
కానీ తమిళనాడులో మాత్రం అనుకున్న స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదని టాక్ వినిపిస్తోంది.;

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు తెలుగులో రెండో స్ట్రయిట్ మూవీ కుబేరతో మరికొద్ది గంటల్లో సందడి చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ సినిమాలో ధనుష్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఆ సినిమా.. జూన్ 20న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసిన మేకర్స్.. సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పారు. మూవీ నుంచి వరుస అప్డేట్స్ తో సందడి చేశారు. ప్రమోషనల్ కంటెంట్ తో సినీ ప్రియుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశారు.
కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కుబేరా మెరుగ్గానే ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. శేఖర్ కమ్ములతోపాటు నాగార్జున ఫ్యాక్టర్ ఇక్కడ బాగానే పనిచేస్తోంది. సినిమా కచ్చితంగా చూడాలనే హైప్ తోనే ఉన్నారు ఆడియన్స్.
కానీ తమిళనాడులో మాత్రం అనుకున్న స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదని టాక్ వినిపిస్తోంది. ధనుష్ కు అక్కడ మంచి క్రేజ్ ఉంది. దీంతో కుబేరకు అక్కడ సాలిడ్ గా ప్రీ బుకింగ్స్ జరుగుతాయని అంచనాలు వెలువడ్డాయి. అయితే నెంబర్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో లేవని సమాచారం. ధనుష్ కు ఫ్యాన్ బేస్ ఉన్న పట్టణ కేంద్రాల్లో కూడా అదే పరిస్థితి అంట.
అయితే ధనుష్ గత చిత్రాలు రాయన్, కెప్టెన్ మిల్లర్ వంటి ప్రాజెక్టులు కూడా మంచి ఓపెనింగ్స్ సాధించాయి. కానీ ఇప్పుడు వాటి ప్రీ బుకింగ్స్ కన్నా కుబేరకు తక్కువే జరిగాయని సమాచారం. గత 10 ఏళ్లలో ధనుష్ కెరీర్ లోనే తక్కువ ప్రీ బుకింగ్స్ జరిగిన మూవీ కుబేర అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ప్రమోషన్స్ కార్యక్రమాలకు తమిళ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదని.. అందుకే ఇలా జరిగిందంటూ.. కొందరు సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.
పాన్ ఇండియా మూవీ కనుక.. తమిళనాడులో కూడా కుబేరకు మంచి వసూళ్లు రాబట్టాలి. అయితే మూవీ మౌత్ టాక్ పాజిటివ్ గా వస్తే ఏమైనా జరగవచ్చు. వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టవచ్చు. ప్రస్తుతానికి మాత్రం పరిస్థితి అనుకున్నంత రేంజ్ లో లేదు. ఏదేమైనా.. తమిళనాడులో కుబేర మూవీ ఎలాంటి హిట్ అవుతుందో.. ఎంతటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.