• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ధనుష్.. ఎంతైనా గ్రేటే..

ధనుష్.. ఎంతైనా గ్రేటే..

| గత ఏడాది రాయన్ తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు ధనుష్.

By - Tupaki Desk
Update: 2025-02-22 06:45 GMT

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దూసుకుపోతున్నారు. ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. మరోవైపు దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది రాయన్ తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు ధనుష్.

తన మేనల్లుడు పవీష్ నారాయణన్ ను హీరోగా జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీతో పరిచయం చేశారు. జెన్ జీ బ్యాచ్‌ను టార్గెట్ చేస్తూ తీసిన ఆ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రోమ్ కామ్ డ్రామాగా ఆడియన్స్ ను మెప్పించింది. కొంతమంది కుర్రాళ్లు, కుర్ర భామలతో తెరకెక్కిన ఆ మూవీ.. మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

అయితే ఆ సినిమాకు సంబంధించిన ఓ రిహార్సిల్ వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అందులో పవీష్ కు ధనుష్.. సీన్ ను నెరేట్ చేస్తూ కనిపించారు. అంతే కాదు.. ఆయన నటించి మరీ చూపించారు. పాత్రలో జీవించేశారు. సీన్ లో భాగంగా నిజంగా టీ షర్ట్ తో నటి కాళ్లు తుడిచారు. దీంతో ఇప్పుడు నెటిజన్లు స్పందిస్తున్నారు.

ధనుష్ చాలా గ్రేట్ అని కామెంట్లు పెడుతున్నారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తన టీ షర్ట్ తో నటి కాళ్లు తుడిచారని చెబుతున్నారు. అదే సమయంలో ధనుష్ లా పవీష్ చేయలేదని చెబుతున్నారు. మ్యాచ్ కూడా చేయలేకపోయారని కొందరు అంటున్నారు. అయితే కొత్త హీరో కదా.. ఎక్స్పీరియన్స్ కావాలి కదా అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇక ధనుష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన తెలుగులో కుబేర మూవీ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మూవీలో ధనుష్ బిచ్చగాడి రోల్ లో కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, రూమర్స్.. సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది.

మరోవైపు, నిత్యా మీనన్‌ తో ఇడ్లీ కడై టైటిల్ తో ధనుష్ మూవీ చేస్తున్నారు. నటిస్తూనే దర్శకత్వం కూడా వహిస్తున్నారు. వాటితో పాటు మరిన్ని ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. ఇంకొన్ని వాటి కోసం చర్చిస్తున్నారు. దీంతో ధనుష్.. వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. మరి ఆయన ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.

Yaar Enna venalum solitu pongada! Antha aalu intha velaiya passion oda rasichiii Pandraaaru! #Dhanush 🫶🏻🤍#NeekBlockbuster #Neek #Dragon #PradeepRanganathan pic.twitter.com/obCbMJjZ5Z

— Idiotic. (@Idiotic888) February 21, 2025
Tags:    
  • Dhanush 
  • Tamilcinema 
  • Director 
  • JabilliNeekuAnthaKopam 
  • PavishNarayan 
  • Romanticcomedy 
  • Debut 
  • Viralrehearsalvideo 
  • Kollywood 
  • Kubermovie 
  • ShekharKammula 
  • IdliKadai 
  • NithyaMenen 
  • Upcomingprojects 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS