ధనుష్ ఇడ్లీ కొట్టు కోసం పోటీ ఎక్కువైందా..?

మామూలుగానే తమిళ హీరోల సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగు హీరోలకు తమిళ్ మార్కెట్ తక్కువ ఉంటుంది.;

Update: 2025-07-15 03:00 GMT

మామూలుగానే తమిళ హీరోల సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగు హీరోలకు తమిళ్ మార్కెట్ తక్కువ ఉంటుంది. కానీ అక్కడ హీరోలు మాత్రం ఇక్కడ మంచి స్కోప్ సాధించారు. ఐతే మిగతా హీరోల లెక్క ఒకలా ఉంటే కోలీవుడ్ స్టార్ ధనుష్ లెక్క మరోలా ఉంటుంది. ఎందుకంటే ఆయన మొన్నటిదాకా కేవలం తమిళ డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సార్ ముందు వరకు పరిస్థితి ఇది.

కానీ సార్ ఈమధ్యనే వచ్చిన కుబేర ఇలా తెలుగు, తమిళ్ బైలింగ్వెల్ తో ధనుష్ సూపర్ హిట్లు కొడుతున్నాడు. ధనుష్ సినిమా ఇదివరకు కన్నా తెలుగులో మార్కెట్ పెరిగింది. సార్, కుబేర రెండు సినిమాలు తెలుగులో సూపర్ కలెక్షన్స్ రాబట్టాయి. అందుకే ధనుష్ చేస్తున్న ఇడ్లీ కొడై తెలుగులో ఇడ్లీ కొట్టు సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది.

ధనుష్ ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే తనకు నచ్చిన కథలను డైరెక్ట్ చేస్తుంటాడు. రాయన్ గా వచ్చి మెప్పించిన అతను ప్రస్తుతం ఇడ్లీ కడై సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఇయర్ అక్టోబర్ 1న రిలీజ్ లాక్ చేశారు. ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ఆసక్తికరమైన పోటీ ఏర్పడుతుందట.

ధనుష్ సినిమా కొనేందుకు మేమంటే మేము అనేస్తున్నారట. సితార బ్యానర్ తో ధనుష్ టచ్ లో ఉన్నాడు. సార్ సినిమా చేసిన సంస్థ అది. మరోపక్క రీసెంట్ హిట్ కుబేర సినిమా చేశారు సునీల్ నారంగ్. సో ఇడ్లీ కడై హక్కులు ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. తప్పకుండా ఇడ్లీ కొట్టు సినిమా తెలుగులో కూడా మంచి బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది.

తెలుగులో ఎలాగు ధనుష్ సినిమాలు మంచి సక్సెస్ లు సాధిస్తున్నాయి. సో ఆ లెక్కన ధనుష్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే ఇడ్లీ కొట్టు సినిమాను భారీ రేటుకే కొనేస్తున్నారట. మరి ధనుష్ ఇడ్లీ కొట్టు తెలుగు రిలీజ్ ఎవరి చేతుల్లోకి వస్తుంది అన్నది త్వరలో తెలుస్తుంది. ధనుష్ ఇడ్లీ కడై సినిమాను డాన్ పిచర్స్, వండర్ బార్ ఫిలంస్ తో పాటుగా రెడ్ జైంట్ మూవీస్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో ధనుష్ కూడా భాగం అవుతున్నారు.

Tags:    

Similar News