ఆ హీరో కోసం సారా-ఖుషీ కపూర్ పోటాపోటీ!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 56వ చిత్రం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.;
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 56వ చిత్రం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ధనుష్ సరసన నటించే కథానాయిక ఎంపిక విషయంలో చిత్ర బృందం కసరత్తులు మొదలు పెట్టింది. ధనుష్ సినిమాల్లో కథానాయిక పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. నాలుగు పాటలకు..రొమాంటిక్ సన్నివేశాలకు నాయిక పరిమితం కాదు. హీరో రోల్ కు ధీటుగా నాయిక పాత్రను ధనుష్ కోరుకుంటాడు. ఈ నేపథ్యంలో నాయిక ఎంపిక విషయంలోనూ దర్శకులు అంతే జాగ్రత్తలు తీసుకుంటారు.
ఈ ప్రాజెక్టు ప్రారంభంలో కన్నడ భామ రుక్మిణీ వసంత్‌ను కథానాయికగా ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావించింది. దాదాపు అమె ఎంట్రీ కూడా ఖరారైంది. అయితే అమ్మడి బిజీ షెడ్యూల్ కారణంగా ప్రాజెక్ట్ వదులుకుంటుంది. ఎంత ప్రయత్నించినా డేట్స్ సర్దుబాటు చేయలేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుండి తప్పుకుందని సమాచారం. రుక్మిణి తప్పుకోవడంతో ఇప్పుడు ఆ స్థానం కోసం బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలోనే దక్షిణాది సినిమాల్లో నటించాలని సారా తన మనసులోని మాటను బయటపెట్టింది.
ధనుష్ వంటి జాతీయ అవార్డు గ్రహీత సరసన నటించడం తన కెరీర్‌కు ప్లస్ అవుతుందని ఆమె భావిస్తోంది. `ధురంధర్` సినిమాతో పాన్ ఇండియాలోనూ అమ్మడికి మంచి గుర్తింపు దక్కింది. తెలుగులో `యూఫోరియా` సినిమాతోనూ లాంచ్ అయింది. అయితే తమిళ్ లో మాత్రం ఇంకా లాంచ్ అవ్వలేదు. ఆ చాన్స్ ధనుష్ కల్పిస్తాడని అమ్మడు ఆశీస్తోంది. అయితే సారా అర్జున్ కు పోటీగా అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా ఈ రేసులో వినిపిస్తోంది. `ది ఆర్చీస్` సినిమాతో వెండితెరకు పరిచయమైన ఖుషీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది.
శ్రీదేవి వారసురాలిగా సౌత్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి ధనుష్ సినిమా కంటే మెరుగైన ఆప్షన్ మరొకటి ఉండదని అమ్మడు భావిస్తోంది. దీంతో ఖుషీ కూడా ఈ పాత్రను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కోలీవుడ్ మీడియా కథనాలు వెడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ ఎంపిక మేకర్స్ కు సవాల్ గా మారే ఛాన్స్ ఉంది. సారా అలీ ఖాన్ కు ఉన్న అనుభవం, ఖుషీ కపూర్ కు ఉన్న ఫ్రెష్ లుక్ మధ్య చిత్ర యూనిట్ తర్జనభర్జన తప్పదు. ప్రస్తుతానికి ఇద్దరు నటీమణులతో ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ధనుష్ మార్కెట్ క్రేజ్ దృష్ట్యా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి సారా అలీ ఖాన్ తన అనుభవంతో ఈ ఛాన్స్ కొట్టేస్తుందా? లేక ఖుషీ కపూర్ అదృస్టంతో , మామ్ ఇమేజ్ తో చేజిక్కించుకుంటుందా? అన్నది చూడాలి. తమిళరసన్ పచ్చముత్తు ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.