జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న దర్శకులు!
ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా బిగ్ బడ్జెట్ చిత్రాలను సైతం పక్కా ప్రణాళికతో అనుకున్న సమయానికి పూర్తి చేసి పండుగ రేసులో నిలబెట్టేందుకు దర్శకులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు.
టాలీవుడ్‌లో చిత్ర నిర్మాణాలు జెట్ స్పీడ్‌తో సాగుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా బిగ్ బడ్జెట్ చిత్రాలను సైతం పక్కా ప్రణాళికతో అనుకున్న సమయానికి పూర్తి చేసి పండుగ రేసులో నిలబెట్టేందుకు దర్శకులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. మేకింగ్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండానే షూటింగ్ షెడ్యూళ్లను శరవేగంగా పూర్తి చేస్తుండటం పరిశ్రమలో ఆకర్షణగా మారింది.
ఈ రేసులో మెగాస్టార్ చిరంజీవి- బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న `కాకా` ముందంజలో ఉంది. ఈ కాంబినేషన్‌పై ఉన్న భారీ అంచనాలకు తగ్గట్లుగానే బాబీ ప్రతి సన్నివేశాన్ని పక్కాగా ప్లాన్ చేస్తూ చిత్రీకరణను వేగంగా ముగిస్తున్నారు. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసే లక్ష్యంతో చిత్ర యూనిట్ ఏమాత్రం విరామం లేకుండా సెట్స్‌పై శ్రమిస్తోంది.
మరోవైపు పర్ఫెక్ట్ ప్లానింగ్‌కు పేరుగాంచిన దర్శకుడు అనిల్ రావిపూడి కూడా సరికొత్త మల్టీస్టారర్ చిత్రాన్ని అంతే వేగంగా పూర్తి చేస్తున్నారు. వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్‌ను శరవేగంగా ముగింపు దశకు తీసుకువచ్చారు. జనవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పక్కా డెడ్‌లైన్‌తో ప్రొడక్షన్ పనులను పరుగులు తీయిస్తున్నారు.
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న `దాదా` చిత్రం కూడా తక్కువ వర్కింగ్ డేస్‌తో షూటింగ్ పూర్తి చేసుకుంటూ రికార్డు దిశగా సాగుతోంది. మాస్ అంశాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నా? వర్కింగ్ డేస్ తగ్గించి అవుట్‌పుట్ త్వరగా తెచ్చేలా దర్శకుడు పక్కా స్కెచ్ వేశారు. డిసెంబర్ 24 విడుదల లక్ష్యంగా ఈ సినిమా చిత్రీకరణను వేగంగా ముగిస్తుండటం విశేషం.
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటిస్తోన్న నయా ప్రాజెక్ట్ కూడా ఇదే తరహా పక్కా ప్రణాళికతో ముస్తాబవుతోంది. రియాలిటీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సినిమాను 50 రోజుల్లోపే పూర్తి చేసేలా చిత్రబృందం టార్గెట్ పెట్టుకుంది. అనవసర ఆలస్యాలు లేకుండా ఏకధాటిగా షెడ్యూళ్లు పూర్తి చేస్తూ అనుకున్న సమయానికే కాన్సెప్ట్ ఆధారిత చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు.
ఈ విధంగా సీనియర్ నటుల నుంచి యంగ్ హీరోల వరకు దర్శకులు పక్కా టైమ్‌లైన్లతో జెట్ స్పీడ్‌తో సినిమాలు పూర్తి చేయడం కాస్త ఊరటనిస్తోంది. సమయానికి షూటింగ్ పూర్తి కావడం వల్ల నిర్మాణం వ్యయం తగ్గడమే కాకుండా, అనుకున్న పండుగ, సీజన్ రిలీజ్ డేట్లను పర్ఫెక్ట్‌గా లాక్ చేసుకునే అవకాశం లభిస్తోంది. ఈ వేగవంతమైన మేకింగ్ సంస్కృతి పరిశ్రమలో ఆరోగ్యకరమైన పరిణామానికి బాటలు వేస్తోందని చెప్పొచ్చు.