ఎట్టకేలకు యంగ్ హీరో ఖాతాలో హిట్ పడ్డట్లేనా..?
సినిమాకు వచ్చిన నెగిటివ్ రివ్యూలతో సంబంధం లేకుండా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుతున్నారు.
బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తాజాగా ‘ది వాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. గత వారం మీర్జాపూర్ సినిమాతో పోటీ పడ్డ ది వాన్ కి బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లు నమోదు అయ్యాయి. పోటీ గట్టిగా ఉన్నప్పటికీ మొదటి వారం రోజుల్లో దాదాపు రూ.40 కోట్ల వసూళ్లు నమోదు చేసిందని, సినిమా లాంగ్ రన్ పూర్తి అయ్యేప్పటికి కచ్చితంగా రూ.65 నుంచి రూ.75 కోట్లు వసూళ్లు చేసే అవకాశాలు ఉన్నాయంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించింది. సినిమాను మరో 'స్త్రీ' మూవీ రేంజ్‌లో ప్రమోట్ చేశారు. కానీ అంత సీన్ లేదని, ఇలాంటి సినిమాలు చూసి చూసి బోర్ కొట్టింది అంటూ రివ్యూలు వచ్చాయి. సినిమాకు వచ్చిన నెగిటివ్ రివ్యూలతో సంబంధం లేకుండా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుతున్నారు.
సిద్దార్థ్ మల్హోత్ర కు జోడీగా తమన్నా...
తమన్నా పాత్ర విషయమై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయి. తమన్నా ఎందుకు ఇలాంటి పాత్రలను ఎంపిక చేసుకుంటుంది అంటూ కొందరు విమర్శిస్తే, మరికొందరు సిద్దార్థ్ మల్హోత్ర కథ విన్న తర్వాతే సినిమాకు ఓకే చెప్పి ఉంటాడా అని కొందరు కామెంట్ చేశారు. మొత్తానికి సినిమాపై సోషల్ మీడియాలో ఒక వర్గం వారు తీవ్రమైన నెగిటివ్ ట్రోల్స్ చేసినా కూడా వసూళ్లు ఒక మోస్తరుగా నమోదు కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వచ్చే వారం నుంచి దృశ్యం 3 హిందీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా వచ్చిన తర్వాత ది వాన్ జోరు తగ్గే అవకాశం ఉంది. అయితే అప్పటికే రాబట్టాల్సిన మొత్తం ఈ సినిమా రాబట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమాకు పెట్టిన బడ్జెట్ దాదాపుగా థియేట్రికల్ రైట్స్, వసూళ్ల రూపంలో వెనక్కి వచ్చినట్లే అని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ది వాన్ మూవీతో...
ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ మూవీలో సిద్దార్థ్ మల్హోత్ర పాత్ర కొత్తగా ఏమీ లేదు. కానీ సినిమా స్క్రీన్ ప్లే కాస్త ఆసక్తిగా సాగడంతో ప్రేక్షకులు థియేటర్ల వద్ద కనిపిస్తున్నారు. పైగా హర్రర్ సినిమాల టైమ్ నడుస్తున్న కారణంగా, ఆ సినిమాలు అంటే ఇష్టపడే వారు ఈ సినిమా కి క్యూ కడుతున్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా బడ్జెట్ మొత్తం వసూళ్ల రూపంలో వెనక్కి రావడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చే మొత్తం నిర్మాతకు లాభాలుగా చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో నిర్మాతకు లాభాలు తెచ్చి పెడుతున్న సినిమాలు చాలా తక్కువ అని చెప్పక తప్పదు. అందుకే ఈ సినిమాను హిందీ బాక్సాఫీస్ వర్గాల వారు, మీడియా వర్గాల వారు హిట్‌గానే చెప్పుకుంటున్నారు. ది వాన్ మూవీ ఈ ఏడాది హిట్ చిత్రాల జాబితాలో చోటు దక్కించుకున్నట్లే అంటున్నారు.
బాలీవుడ్‌లో భారీ విజయం..
హీరో సిద్దార్థ్ మల్హోత్ర సాలిడ్ హిట్ దక్కించుకుని దశాబ్ద కాలంకు పైగా అయింది. 2014లో ఈయన నటించిన ఏక్ విలన్ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఆ తర్వాత 2016లో వచ్చిన కపూర్ అండ్ సన్స్ మూవీతో దాదాపు రూ.75 కోట్లు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు సరైన కమర్షియల్ హిట్ దక్కలేదు. మధ్యలో షేర్‌షా సినిమా వచ్చినప్పటికీ ఆ సినిమా ఓటీటీ ద్వారా వచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయ్యి ఉంటే రూ.100 కోట్లకు మించి వసూళ్లు నమోదు అయ్యేవి. సిద్దార్థ్ మల్హోత్రా దాదాపు పదేళ్ల తర్వాత హిట్ కొట్టినట్లే అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ది వాన్ సినిమా మీడియం రేంజ్ బడ్జెట్‌తో రూపొందిన కారణంగా సినిమాకు తక్కువ వసూళ్లు వచ్చినా లాభాలు రావడంతో హిట్ మూవీగా చెప్పుకుంటున్నారు. బాలీవుడ్‌లో సక్సెస్ శాతం దారుణంగా పడిపోయిన ఈ సమయంలో ఈ సినిమా హిట్ కొట్టడంతో సిద్దార్థ్ మల్హోత్ర క్రేజ్ పెరిగినట్లు అయిందని ఆయన అభిమానులు అంటున్నారు.