• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నందమూరి బ్రాండ్ గట్టిగా...

నందమూరి బ్రాండ్ గట్టిగా వాడుతున్న కార్తికేయ

| బాబాయ్ డైలాగ్‌తో మొదలై అబ్బాయ్ ఎంట్రీతో ముగియడం వెనుక రాజమౌళి కాంపౌండ్ పక్కా ప్లానింగ్ కనిపిస్తోంది.

By - M Prashanth
Update: 2026-09-29 11:41 GMT

మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ తెలుగులో ఇప్పటివరకు కనిపించిన పాత్రలు వేరు, ఇప్పుడు వస్తున్న సినిమా వేరు. ‘పుష్ప’లో భన్వర్ సింగ్ షెకావత్‌గా విలనిజం పండించిన ఫహాద్, తొలిసారిగా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అంటూ తెలుగులో సోలో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అక్టోబర్ 2న థియేటర్లలోకి దిగుతున్న ఈ సినిమాకి అనుకున్నంత బజ్ రావట్లేదా అన్న అనుమానాలు మొదలైన టైమ్‌లో, నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ వేసిన ఒకే ఒక్క ఎత్తుగడతో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది.




 


ఈ సినిమాకి నందమూరి బ్రాండ్‌ను జోడించిన తీరే ఇక్కడ అసలైన ట్విస్ట్. టైటిల్‌లోనే బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ ఉండగా, ఏకంగా బాలయ్యతోనే తెలుగు ట్రైలర్‌కి వాయిస్ ఓవర్ చెప్పించి సినిమాపై తొలి బజ్‌ను క్రియేట్ చేశారు. కట్ చేస్తే, సరిగ్గా రిలీజ్‌కు రెండు రోజుల ముందు హైదరాబాద్ లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకు రానున్నారు.

బాబాయ్ డైలాగ్‌తో మొదలై అబ్బాయ్ ఎంట్రీతో ముగియడం వెనుక రాజమౌళి కాంపౌండ్ పక్కా ప్లానింగ్ కనిపిస్తోంది. సినిమా కాన్సెప్ట్ చూస్తే.. సూరి అనే ఒక చిల్లర మేజీషియన్, ఒక జీనీ బాలిక చుట్టూ తిరిగే సోషియో ఫాంటసీగా తెరకెక్కింది. శశాంక్ యేలేటి దర్శకత్వం. ఫహాద్ లాంటి సీరియస్ యాక్టర్‌ను ఫ్యామిలీ, కిడ్స్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసే ఫన్ రోల్‌లో చూపించడం కాస్త కొత్త ప్రయత్నమే.




 


ఎమోషన్స్, మ్యాజిక్ వర్కవుట్ అయితే ఓకే కానీ, తెలుగు ఆడియన్స్ ఫహాద్‌ను ఇలాంటి లైటర్ వీన్ క్యారెక్టర్‌లో ఎంతవరకు ఓన్ చేసుకుంటారనే దానిపైనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది. అయితే ఇక్కడ మేకర్స్‌కి అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, తెరవెనుక ఉన్న బలమైన ప్రొడక్షన్ ఫోర్స్. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి కార్తికేయ స్వయంగా నిర్మించగా, స్వయంగా ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తుండటం ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ వైబ్ తెచ్చింది.

బాహుబలి నిర్మాతల సినిమా అంటే మినిమం క్వాలిటీ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఎలాగూ ఉంది. దానికి తోడు కాలభైరవ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మెయిన్ పిల్లర్‌గా నిలవనుందని టాక్. ఇప్పుడు అందరి కళ్లూ తారక్ ఈవెంట్ మీదే పడ్డాయి. రాజమౌళి ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యం, పైగా ఫహాద్ లాంటి బ్రిలియంట్ యాక్టర్ తెలుగు సినిమా చేస్తుండటంతో ఎన్టీఆర్ ఈ వేదికపై ఇచ్చే స్పీచ్ చివరి నిమిషంలో ఓపెనింగ్స్‌ను భారీగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

కార్తికేయ షేర్ చేసిన ఫోటోలో తారక్, ఫహాద్, కార్తికేయ కలిసి నవ్వుతూ ఇచ్చిన స్టిల్స్ సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అయిపోయాయి. కంటెంట్ బలంగా ఉన్నప్పటికీ లోకల్ మార్కెట్‌లో హైప్ సరిపోదనుకున్న ప్రొడ్యూసర్లు, ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపి సినిమాను సరిగ్గా సేఫ్ జోన్‌లోకి నెట్టే ప్రయత్నం చేశారు. బాలయ్య వాయిస్ ఓవర్, తారక్ లైవ్ ఎంట్రీ బాక్సాఫీస్ రన్‌ను ఎంతవరకు పరుగులు పెట్టిస్తుందో చూడాలి.

Tags:    
  • fahadhfaasil 
  • donttroublethetrouble 
  • jrntr 
  • balakrishna 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS