సినిమా సక్సెస్ లో కమెడియన్ పాత్ర ఏంటి? ప్రస్తుతం మన దర్శకులు వాళ్ల ను ఎలా చూపిస్తున్నారు?

ఇక కాలక్రమేనా కమెడియన్ అనేవాళ్లను కథలో భాగం చేస్తూ వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తూ సినిమా స్టోరీలను రాసుకుంటూ వచ్చారు.

Update: 2026-09-29 12:30 GMT

ఒకప్పుడు సినిమా సక్సెస్ లో కమెడియన్ పాత్ర చాలా కీలకంగా ఉండేది... సిరియస్ మూడ్ లో సాగుతున్న సినిమా మధ్యలో కమెడియన్ వచ్చి తన పంచులతో కాసేపు నవ్వులు పూయించి ప్రేక్షకుడికి కాస్త రిలీఫ్ ఇచ్చి వెళ్లిపోయేవాడు...అందుకే అప్పట్లో కమెడియన్ల పాత్ర సపరేట్ గా తీర్చిదిద్దే వారు. హైలెట్ గా నిలిచిన కొన్ని కామెడీ సన్నివేశాల కోసం ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి రిపీటెడ్ గా సినిమాలను చూసేవారు... మరికొన్ని సినిమాల్లో కొందరు కమెడియన్లు కామెడీ చేస్తూనే సపోర్టింగ్ క్యారెక్టర్ లను కూడా పోషించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా వెంకటేష్, జగపతిబాబు లాంటి హీరోలు చేసిన సినిమాల్లో కమెడియన్ సుధాకర్ కామెడీ పాత్రను పోషిస్తూనే హీరోలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్లకు సపోర్టుగా నిలిచి హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడానికి సహాయపడేవాడు. ఇక కాలక్రమేనా కమెడియన్ అనేవాళ్లను కథలో భాగం చేస్తూ వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తూ సినిమా స్టోరీలను రాసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఒకానొక సందర్భంలో కమెడియన్స్ లేకపోతే సినిమాలు అనుకున్న రేంజ్ లో సక్సెస్ లను సాధించలేవా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి... ఇక తెలుగులో టాప్ కమెడియన్ గా గుర్తింపును సంపాదించుకున్న 'బ్రహ్మానందం' క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఒకానొక సందర్భంలో తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరు బ్రహ్మానందం డేట్స్ తీసుకున్న తర్వాత మా దగ్గరికి రండి అప్పుడు మేము డేట్స్ ఇస్తాం అంటూ కొన్ని కండిషన్స్ కూడా పెట్టారట. ఇక తమిళంలో సూపర్ స్టార్ 'రజినీకాంత్' సైతం అక్కడ టాప్ కమెడియన్ అయిన వడివేలు డేట్స్ ఇచ్చిన తర్వాత నేను డేట్స్ ఇస్తానని దర్శకులకు డైరెక్ట్ గా చెప్పేవారట. అంటే ఒక కమెడియన్ చేసే కామెడీ సినిమా మీద ఎంతలా ప్రభావం చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి కమెడియన్స్ ను సైతం పూర్తి స్థాయిలో కథలో భాగం చేస్తూ సినిమాను ముందుకు నడిపిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ లో టెక్నికల్ గా ఎన్ని మార్పులు వచ్చిన కూడా కథతో పాటు ప్యూర్ కామెడీని అందించినంత కాలం ప్రేక్షకులు ఆ కామెడీని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. కమెడియన్లు సినిమా సక్సెస్ లో తమ వంతు పాత్రను పోషిస్తూనే ఉంటారు...

కమెడియన్స్ విలన్స్ గా మారితే

రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాల్లో సైతం కమెడియన్స్ ను మెయిన్ విలన్స్ గా చూపించారు. సుమంత్ హీరోగా వచ్చిన 'మహేందర్ గిరి వారాహి' సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ఇద్దరు కూడా మెయిన్ విలన్స్ గా కనిపించడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. రెగ్యూలర్ గా విలన్ క్యారెక్టర్లు చేసే నటులుగాని, లేదంటే ఇతర నటులు కానీ విలన్ పాత్రలను పోషిస్తే అంత ఫీల్ ఉండేది కాదు. కానీ కమెడియన్స్ విలన్స్ గా చేయడం అనేది ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది.

అలాగే కమెడియన్స్ ప్రస్తుతం హీరోలుగా కూడా మారి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటున్నారు. సుహాస్ లాంటి నటుడు కమెడియన్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన కూడా ఆ తర్వాత హీరోగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూరి సైతం మొదట కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన తర్వాత హీరోగా మారి డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు...

Tags:    

Similar News