కామ్రేడ్ కళ్యాణ్.. ఫుల్ కామెడీలో ఈ సీరియస్ ట్విస్ట్ ఏంటి?
శ్రీవిష్ణు సినిమా అంటేనే థియేటర్లలో పక్కా ఎంటర్టైనర్ అనే గ్యారెంటీ ఉంటుంది. రీసెంట్ హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ హీరో, ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్' అంటూ అక్టోబర్ 9న బరిలోకి దిగుతున్నాడు.
శ్రీవిష్ణు సినిమా అంటేనే థియేటర్లలో పక్కా ఎంటర్టైనర్ అనే గ్యారెంటీ ఉంటుంది. రీసెంట్ హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ హీరో, ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్' అంటూ అక్టోబర్ 9న బరిలోకి దిగుతున్నాడు. లాల్ సలామ్ అనే ట్యాగ్‌లైన్‌తో ఇది పక్కా హిలేరియస్ ఎంటర్‌టైనర్ అని ప్రమోషన్స్ మొదట్లోనే టీమ్ స్పష్టం చేసింది. అయితే లేటెస్ట్ గా రిలీజ్ చేసిన 'ఎత్తరా ఎత్తు' లిరికల్ సాంగ్ చూశాక మాత్రం ఆడియన్స్‌కు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది.
కామెడీ ట్రాక్ ఉన్న సినిమాల్లో ఫన్నీ పెప్పి సాంగ్స్ ఆశిస్తాం. కానీ అనూహ్యంగా నారాయణమూర్తి సినిమాలను గుర్తుచేసే పక్కా విప్లవ గీతాన్ని వదిలారు మేకర్స్. నల్లగొండ గద్దర్ నర్సన్న గొంతులోంచి వచ్చిన ఆ రా అండ్ రస్టిక్ వాయిస్ పాటకు అద్భుతమైన డెప్త్ తీసుకొచ్చింది. గొడ్డలి, కొడవలి, ఎర్రజెండా పదాలతో భాస్కరభట్ల రాసిన సాహిత్యం ఉద్యమ కాలం నాటి ఆవేశాన్ని ప్రతిబింబించేలా ఉంది.
విజయ్ బుల్గానిన్ ఇచ్చిన డప్పుల బీట్, మాస్ టెంపో పాటను వెంటనే క్యాచీగా మార్చేశాయి. విజువల్స్‌లో శ్రీవిష్ణు మెడలో ఎర్ర కండువా వేసుకుని, చేతిలో గొడ్డలి పట్టుకుని గంభీరంగా నడుస్తున్న షాట్లు చూస్తే ఏదో సీరియస్ విప్లవ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆవేశంగా గ్రామస్థులను ముందుండి నడిపిస్తున్న సీన్లు పాటలో ఇంటెన్సిటీని అమాంతం పెంచేశాయి.
ఒక కామెడీ డ్రామాలో ఇంత హై వోల్టేజ్ సీరియస్ సాంగ్ పెట్టడం వెనుక దర్శకుడు జానకిరామ్ మారెళ్ల ఎలాంటి ప్లానింగ్ వేశాడనే ఆసక్తి మొదలైంది. నిజంగానే హీరో క్యారెక్టర్ విప్లవ బాట పడుతుందా? లేక శ్రీవిష్ణు స్టైల్ లో సిట్యువేషన్ డిమాండ్ చేసి సరదాగా నక్సలైట్ గెటప్ వేస్తే వచ్చే కామెడీ సీనా? అనేది కథలో మెయిన్ సస్పెన్స్‌గా కనిపిస్తోంది.
ఈ కాంట్రాస్ట్ ఎలిమెంట్ సినిమాపై సహజంగానే క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. సీరియస్ సెటప్‌లో కామెడీ పండించడం శ్రీవిష్ణుకు కొట్టిన పిండి. కోన వెంకట్ సమర్పణలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తోంది. అవుట్‌పుట్ చూస్తుంటే కేవలం కామెడీకి మాత్రమే పరిమితం కాకుండా, ఒక మంచి ఎమోషనల్ అండర్ కరెంట్ కూడా సినిమాలో గట్టిగానే ఉన్నట్టు అర్థమవుతోంది. ఓవరాల్‌గా నవ్వుల కళ్యాణ్ ఎర్రబాట వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటనేది చూడాలి. అక్టోబర్ 9న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.