'దండోరా' టైటిల్ సాంగ్.. హైప్ ఎక్కించిందిగా!

రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హ్యుమ‌ర్ ట‌చ్‌తో పాటు మంచి సోష‌ల్ మెసేజ్ తో సినిమా రూపొందుతుందని క్లారిటీ ఇచ్చింది.;

Update: 2025-12-13 07:11 GMT

సూపర్ హిట్ మూవీస్ కలర్ ఫొటో, బెదురులంక 2012ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పనేని ఇప్పుడు దండోరా మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. యువ నటీనటులు రవికృష్ణ, మనికా చిక్కాల జంటగా నటిస్తున్నారు.

శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్క్ కె రాబిన్ మ్యూజిక్ అందిస్తుండగా.. డిసెంబర్ 25వ తేదీ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే మూవీపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచుతున్నారు మేకర్స్.

రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హ్యుమ‌ర్ ట‌చ్‌తో పాటు మంచి సోష‌ల్ మెసేజ్ తో సినిమా రూపొందుతుందని క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత విడుదలైన పిల్లా అనే లిరికల్ వీడియో సాంగ్ ఓ రేంజ్ లో అందరినీ ఆకట్టుకుంది. మార్క్ కె రాబిన్ కంపోజ్ చేయగా.. పూర్ణ చారి క్యాచీ లిరిక్స్ ప్రత్యేకంగా నిలిచాయి.

ఇప్పుడు సినిమా నుంచి టైటిల్ సాంగ్ తాజాగా రిలీజ్ అయింది. ఆధిపత్యం యొక్క మరో అధ్యాయం తెరుచుకుంది అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రస్తుతం నెట్టింట.. టైటిల్ సాంగ్ కూడా వైరల్ గా మారి అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ఈ సాంగ్ కూడా అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

నిను మోసినా.. నను మోసినా.. అమ్మ పేగు ఒకటే అన్న అంటూ సాగుతున్న పాటకు ప్రముఖ కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. మార్క్ కె రాబిన్ సాంగ్ ను కంపోజ్ చేసి ఆంథోని దాసన్ తో కలిసి ఆలపించారు. శివాజీ, నవదీప్ పై ఉండనున్న సాంగ్.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేలా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పాలి.

ముఖ్యంగా సాంగ్ లో ప్రతి లిరిక్ కూడా అదిరిపోయింది. మార్క్ కె రాబిన్ కంపోజిషన్ సూపర్ గా ఉంది. అంతేకాదు ఆయన ఆంథోని దాసన్ తో కలిసి గాత్రం ద్వారా ప్రాణం పోశారు. ఓవరాల్ గా సాంగ్ ఓ రేంజ్ లో ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఫస్ట్ టైమ్ విన్నగానే ఎక్కేసిందని అంటున్నారు. సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసిందని అంటున్నారు. మరి దండోరా మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News