• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవర - జై లవకుశ... ఆ...

దేవర - జై లవకుశ... ఆ విషయంలో పోలికనా?

| వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఎన్టీఆర్ గత చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

By - Tupaki Desk
Update: 2024-02-19 08:21 GMT

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఎన్టీఆర్ గత చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో దేవర సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి అనడంలో సందేహం లేదు.

సినిమా కథ పరిధి పెద్దగా ఉన్న నేపథ్యంలో రెండు పార్ట్‌ లుగా తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా ఇప్పటికే కొరటాల శివ ప్రకటించాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ను మూడు విభిన్నమైన పాత్రలో చూపించేందుకు దర్శకుడు కొరటాల శివ కథ ను రెడీ చేశాడు అంటున్నారు.

గతంలో ఎన్టీఆర్‌ 'జై లవకుశ' సినిమాలో మూడు విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. అందుకే ఇప్పుడు మరోసారి మూడు పాత్రల్లో అంటే కచ్చితంగా ఫ్యాన్స్ కి కన్నుల పండుగ ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేవర సినిమాలో ఎన్టీఆర్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడా అనేది ఇప్పటి వరకు యూనిట్‌ సభ్యుల నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఆఫ్ ది రికార్డ్‌ గా మాత్రం ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ ఈ విషయమై త్వరలోనే క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

ఈ సినిమా తో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు గాను బాలీవుడ్‌ స్టార్ నటుడు సైఫ్‌ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది అక్టోబర్ లో సినిమా విడుదల కాబోతున్నట్లుగా ఇటీవల కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

Whose votes will YS Sharmila split?#YSSharmila #CongressParty #YSRCP #TDPJanasena #AndhraPradesh #Tupaki

— Tupaki (@tupaki_official) February 19, 2024
Tags:    
  • Tollywood 
  • Jailavakusa 
  • Devara 
  • Ntr 
  • Kortalasiva 
  • Bollywood 
  • Janhvikapoor 
  • Saifalikhan 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS