దేవర ఫియర్ సాంగ్.. ఇలా జరిగిందేంటి?

పాటను ఎనర్జిటిక్ గా అనిరుధ్ డిజైన్ చేసినా లిరిక్స్ అస్సలు అర్థం కాలేదని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. పోనీ లిరిక్స్ నెట్టింట చూసినా.. చదవడానికి కూడా కష్టంగా ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు.

Update: 2024-05-20 08:01 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు దేవర, మరోవైపు వార్-2 షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన వార్-2 షెడ్యూల్ లో పాల్గొని తిరిగి వచ్చారు. ఆ షెడ్యూల్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, తారక్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిసింది. ఇక కొరటాల శివ కూడా దేవర షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

దసరా కానుకగా విడుదల కానున్న దేవర పార్ట్-1 షూటింగ్ ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి.. ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అదే జోష్ తో మేకర్స్.. నిన్న మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తారక్ బర్త్ డే సందర్భంగా దేవర ముంగిట నువ్వెంత అంటూ సాగుతున్న పాటను ఆదివారం విడుదల చేశారు.

అయితే ఈ సాంగ్ కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించి పాడారు కూడా. తెలుగులో ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. అయితే ఇంటెన్స్‌ తో పాటు తన మార్క్ ట్రెండీ ట్యూన్‍ ను ఇచ్చారు అనిరుధ్. ఎన్టీఆర్ ఫ్యాన్స్.. పాట అదిరిపోయిందని కామెంట్లు పెట్టారు. నైస్ బర్త్ డే ట్రీట్ అని పోస్టులు పెట్టారు. కానీ నెటిజన్లు మాత్రం సాంగ్ విషయంలో చాలా నిరాశ చెంది వరుస ట్వీట్లు చేస్తున్నారు.

పాటను ఎనర్జిటిక్ గా అనిరుధ్ డిజైన్ చేసినా లిరిక్స్ అస్సలు అర్థం కాలేదని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. పోనీ లిరిక్స్ నెట్టింట చూసినా.. చదవడానికి కూడా కష్టంగా ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. సౌండ్‌ తో పాటు ఎన్టీఆర్‌ విజువల్స్, అనిరుధ్ డాన్స్ మూమెంట్లు లిరిక్స్ ను డామినేట్‌ చేశాయని అంటున్నారు. పాటలో తారక్ కన్నా అనిరుధ్ హీరోయిజం చాలా ఎక్కువ ఉందని చెబుతున్నారు.

Read more!

తెలుగు ప్రేక్షకుల పల్స్ ను అనిరుధ్ పట్టుకోలేకపోతున్నారని, ఇండస్ట్రీలో రాణించాలంటే ఇంకా కష్టపడాలని సూచిస్తున్నారు. డీఎస్పీని చూసి నేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. పుష్ప-2 టైటిల్ సాంగ్ ను ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ తో డిస్సపాయింట్ చేశారని, నెక్స్ట్ సాంగ్ అయినా బాగున్నట్లు చూడాలని డైరెక్టర్ ను కోరుతున్నారు. మొత్తానికి ఫస్ట్ సింగిల్ చాలా మంది మెప్పించ లేదన్నమాట. ఇక ఈ డ్యామేజ్ కంట్రోల్ అవ్వాలంటే కొరటాల శివ సరైన అప్డేట్ ఇవ్వాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News