• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవర.. లైగర్ టైమ్ లో కూడా...

దేవర.. లైగర్ టైమ్ లో కూడా ఇలానే..

| ఇప్పుడు దేవర మూవీ ప్రమోషన్స్ లో కూడా ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని కరణ్ జోహార్ ప్రకటించాడు. అయితే దేవర రిజల్ట్ బట్టి కరణ్ జోహార్ నిర్ణయం కూడా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-09-12 03:46 GMT

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర సినిమాని హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలో దేవర సినిమా ప్రమోషన్స్ బాధ్యతలు కరణ్ జోహార్ తీసుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ ని ఉపయోగించుకొని సినిమాని మార్కెట్ లోకి బలంగా తీసుకొని వెళ్లాలని కరణ్ జోహార్ అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దేవర మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ని కరణ్ జోహార్ ఇంటర్వ్యూ చేశారు.

ఈ సందర్భంగా ధర్మ ప్రొడక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తానని కరణ్ జోహార్ ప్రకటించాడు. అయితే ఇది సాధ్యమవుతుందా అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్ లో ఇప్పటి వరకు సౌత్ హీరోలతో ఒక్క సినిమా కూడా చేయలేదు. మేగ్జిమమ్ ఆయన సినిమాలన్నీ బాలీవుడ్ స్టార్స్ తోనే ఉంటాయి. అయితే సౌత్ లో స్టార్ హీరోలు ఇంటరెస్టింగ్ కథలతో పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు.

అందుకే వాటి హిందీ రైట్స్ ని కరణ్ జోహార్ సొంతం చేసుకొని నార్త్ లో రిలీజ్ చేసి లాభాలు పొందుతున్నారు. గతంలో లైగర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో ధర్మ ప్రొడక్షన్స్ లో విజయ్ దేవరకొండ హీరోగా రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడనే ప్రచారం బిటౌన్ లో నడిచింది. విజయ్ తో వర్క్ చేస్తానని లైగర్ ప్రమోషన్స్ లో కరణ్ జోహార్ ప్రకటించాడు. అయితే లైగర్ డిజాస్టర్ తర్వాత విజయ్ తో సినిమా ఆలోచన చేయలేదు.

ఇప్పుడు దేవర మూవీ ప్రమోషన్స్ లో కూడా ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని కరణ్ జోహార్ ప్రకటించాడు. అయితే దేవర రిజల్ట్ బట్టి కరణ్ జోహార్ నిర్ణయం కూడా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. వార్ 2 సినిమాతో తారక్ ని యష్ రాజ్ ఫిలిమ్స్ హిందీలోకి లాంచ్ చేస్తోంది. ఈ మూవీ సక్సెస్ అయితే బాలీవుడ్ లో తారక్ ఇమేజ్ పెరుగుతుంది. బాలీవుడ్ ఇమేజ్, తారక్ పాన్ ఇండియా మార్కెట్ పెరిగిన తర్వాత సినిమా చేస్తే కరణ్ జోహార్ కి కూడా కలిసొచ్చే ఛాన్స్ ఉంటుంది.

సౌత్ హీరోల విషయంలో కరణ్ జోహార్ ఇప్పటి వరకు తన ప్రామిస్ ని నిలబెట్టుకోలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఎన్టీఆర్ తో మాత్రం మూవీ చేసే అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నారు. హీరోల మార్కెట్, ఇమేజ్ బట్టి మాత్రమే కరణ్ జోహార్ సినిమాలు చేస్తాడనే టాక్ బిటౌన్ లో ఉంది. దేవర, వార్ 2 సినిమాలు సక్సెస్ అయితే కచ్చితంగా కరణ్ జోహార్ తారక్ తో సినిమా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న డ్రాగన్ మూవీ కంప్లీట్ అయ్యాకే అది సాధ్యం అవ్వొచ్చు అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    
  • Devara 
  • JrNTR 
  • Koratalasiva 
  • Hindirights 
  • Karanjohar 
  • Panindianmovies 
  • Liger 
  • Saifalikhan 
  • Janhvikapoor 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS