• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిచ్చగాడిని ఫాలో అవుతున్న...

బిచ్చగాడిని ఫాలో అవుతున్న మహేష్ మేనల్లుడు?!

| నటశేఖర కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న రెండో సినిమా ''దేవకీ నందన వాసుదేవ''.

By - Tupaki Desk
Update: 2024-11-19 12:19 GMT

నటశేఖర కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న రెండో సినిమా ''దేవకీ నందన వాసుదేవ''. 'గుణ 369' ఫేమ్ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'హను-మాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందనే వచ్చింది. పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకోగా, ట్రైలర్ ఆసక్తిని కలిగించింది. విడుదలకు సిద్దమైన ఈ మూవీ ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మేకర్స్ ఓ న్యూ ప్రమోషనల్ స్ట్రాటజీకి శ్రీకారం చుట్టారు. రిలీజ్ కు ముందే కొన్ని నిమిషాల సినిమాని చూపిస్తున్నారు.

'దేవకీ నందన వాసుదేవ' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో గ్రాండ్ గా జరగనుంది. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ఈ ఈవెంట్‌లో తొలి 5 నిమిషాల చిత్రాన్ని ప్రదర్శించనున్నట్టు చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆడియన్స్ కు ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నామని పేర్కొనడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్ మేనల్లుడి స్ట్రాటజీ ఏమాత్రం వర్కౌట్ అవుతుందో అని ఫిలిం సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు.

నిజానికి సినిమా తీయడం ఒక ఎత్తైతే, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు అని చెప్పాలి. ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన సినిమా అయినా, ఎంత మంచి కంటెంట్ ఉన్నా సరే, ఆడియన్స్ దృష్టి దృష్టి పడేలా ప్రమోషన్స్ చేయకపోతే ఫలితం ఉండదు. అందుకే గ్లింప్స్, టీజర్‌, ట్రైలర్లు, పాటలు రిలీజ్ చేసి సినిమాకి బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. సోషల్ మీడియా పరిధి పెరిగిన తర్వాత, రకరకాల పద్ధతుల్లో సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 'దేవకీ నందన వాసుదేవ' టీమ్ ఒకడుగు ముందుకేసి ఏకంగా సినిమాలోని మొదటి 5 నిమిషాల కంటెంట్ ను ప్రేక్షకులకు చూపించడానికి రెడీ అయ్యారు.

తమిళ హీరో విజయ్ ఆంటోనీ గతంలో తన సినిమాలకి హైప్ తీసుకురావడానికి ఇదే ప్రమోషనల్ స్ట్రాటజీని ఉపయోగించేవారు. 'బిచ్చగాడు' దగ్గర నుంచి 'బిచ్చగాడు 2' వరకూ ప్రతీ సినిమా విడుదలకు ముందే కీలకమైన సన్నివేశాలను, లేదా మొదటి ఐదారు నిమిషాల సినిమాని సోషల్ మీడియాలో వదిలేవాడు. చాలా సందర్భాల్లో ఈ ప్రయోగం వర్కౌట్ అయింది కూడా. ఇప్పుడు అశోక్ గల్లా 'దేవకీ నందన వాసుదేవ' సినిమాకి ఇదే పద్ధతి ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

'దేవకీ నందన వాసుదేవ'.. డివైన్ ఎలిమెంట్స్ తో కూడిన యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇందులో అశోక్ మాస్ యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. ఫెమినా మిస్ ఇండియా-2020 విన్నర్ మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చగా.. ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీని నిర్వహించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాసిన ఈ సినిమాకి తమ్మిరాజు ఎడిటర్‌ గా వర్క్ చేసారు. ఈ మూవీ నవంబర్ 22న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది.

For the FIRST TIME EVER,EXPERIENCE THE UNSEEN ❤️‍🔥Watch the FIRST 5 MINUTES of#DevakiNandanaVasudeva 💥EXCLUSIVELY at the PRE-RELEASE EVENT Today at ITC Kohenur, Hyd😍Watch Live Here 👇https://t.co/no0q69Kejb#DNVonNov22 🤩@AshokGalla_ @varanasi_manasa @ArjunJandyala… pic.twitter.com/OwwagLOvty

— Sri Lalithambika Productions (@lalithambikaoff) November 19, 2024
Tags:    
  • Devakinandanavasudeva 
  • Devakinandanavasudevamovie 
  • Ashokgalla 
  • Arjunjandyala 
  • Bichagadumovie 
  • Moviepromotions 
  • Tollywood 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS