ర‌ణ‌బీర్ (X) దీపిక‌: మాజీలు ఊహించ‌ని షాక్‌లేమిటో

ఆ ఇద్ద‌రూ మాజీ ప్రేమికులు. ఒక‌ప్పుడు ఘాడంగా ప్రేమించుకుని, అటుపై అనూహ్యంగా బ్రేక‌ప్ అయి, అభిమానుల‌ను ఉసూరుమ‌నిపించారు.;

Update: 2025-10-05 06:42 GMT

ఆ ఇద్ద‌రూ మాజీ ప్రేమికులు. ఒక‌ప్పుడు ఘాడంగా ప్రేమించుకుని, అటుపై అనూహ్యంగా బ్రేక‌ప్ అయి, అభిమానుల‌ను ఉసూరుమ‌నిపించారు. ఆ ఇద్ద‌రూ వేర్వేరు వ్య‌క్తుల‌ను పెళ్లాడి ఇప్పుడు త‌లో బిడ్డ‌తో హాయిగా త‌మ భాగ‌స్వామితో కాపురాలు చేసుకుంటున్నారు. ఇండ‌స్ట్రీలో పాపుల‌ర్ సెల‌బ్రిటీ జంట‌లుగా వెలిగిపోతున్నారు.

అయితే మారిన ద‌శాబ్ధ కాలంలో, వారిలో చాలా మార్పులు క‌నిపిస్తున్నాయి. ఇప్పుడు అంతులేని ప‌రిణ‌తి. హుందాత‌నం.. కుర్ర‌త‌నం.. అల్ల‌రి.. వెర్రి వేషాలు పూర్తిగా త‌గ్గిపోయాయి. బిడ్డ త‌ల్లిగా ఆమె, బిడ్డ తండ్రిగా అత‌డు చాలా చాలా మారారు. ఏదో ఆవేశంలో రిలేష‌న్ షిప్ లు ఇప్పుడు లేవు.

కార‌ణం ఏదైనా కానీ, ఇప్పుడు ఈ మాజీ ప్రేమికులు ఒక‌రికొక‌రు ఎదురుప‌డ్డారు. విమానాశ్ర‌యంలో ఆ ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకున్న తీరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆమె అత‌డికి ఒక హ‌గ్ ఇచ్చి అక్క‌డి నుంచి నిష్కృమించింది. ఈ ప్ర‌పంచంలో నీ అంత గొప్ప వ్య‌క్తి లేడు! అని ఆమె.. ఈ ప్ర‌పంచంలో నీవంటి ప‌రిణ‌తి చెందిన యువ‌తి లేద‌ని అత‌డు భావించేంత‌గా ఆ స‌న్నివేశం ర‌క్తి క‌ట్టించింది.

ఏది ఏమైనా ఈ ఎపిసోడ్ ని వీక్షించిన అభిమానులు మాత్రం మ‌రోసారి పాత రోజుల‌ను గుర్తు చేసుకున్నారు. `యే దివానీ హై జ‌వానీ` స‌మ‌యంలోని చిలిపి రోజుల‌ను త‌ల‌చుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు అంతా ప‌రిణ‌తితో కూడుకున్న వ్య‌వ‌హారం.. అప్ప‌టిలా తొంద‌ర‌పాటు తొట్రుపాటు వారిలో లేనే లేవు. ఇదంతా ఎవ‌రి గురించో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు. ర‌ణ్ వీర్ ని పెళ్లాడిన -దీపిక‌, ఆలియాను పెళ్లాడిన-ర‌ణ్ బీర్ .. ఇద్ద‌రూ ఇప్పుడు ఒంట‌రిగా ప్ర‌యాణాల‌లో ఉన్న‌ప్పుడు విమానాశ్ర‌యంలో ఒక‌రికొక‌రు ఎదురుప‌డ్డారు. ఈ క్ష‌ణం చాలా అరుదైనది. ఆ ఇద్ద‌రి హ‌గ్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.

Tags:    

Similar News