స్పిరిట్‌లో కుదరలేదు.. మిగతా సినిమాల్లో ఎలా సెట్టైంది!

దీపికా పదుకొణె విషయంలో ‘స్పిరిట్’ వివాదం మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు.

Update: 2026-08-28 10:30 GMT

దీపికా పదుకొణె విషయంలో ‘స్పిరిట్’ వివాదం మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు. రెమ్యునరేషన్, ఎనిమిది గంటల పని, లాభాల్లో పది శాతం వాటా వంటి విషయాల్లో లెక్క కుదరలేదనీ అన్నారు. ఇక్కడే మరో డౌట్ వస్తోంది. అదే సమయంలో దీపిక ‘కింగ్’, అల్లు అర్జున్ అట్లీ రాకా సినిమాల్లో నటిస్తోంది. అంటే సమస్య మొత్తం దీపిక దగ్గరే ఉందని చెప్పే పరిస్థితి లేదు.

‘స్పిరిట్’ ఒక్కటే కాదు. ‘కల్కి 2’ నుంచి కూడా దీపిక బయటకు వచ్చిన విషయం ఇప్పటికే అధికారికంగా బయటకు వచ్చింది. వైజయంతీ మూవీస్ అప్పట్లో ఈ కాంబో ముందుకు వెళ్లడం లేదని చెప్పింది. దీంతో వరుసగా రెండు భారీ సినిమాల నుంచి ఆమె తప్పుకోవడంతో పని గంటలు, డేట్స్, రెమ్యునరేషన్ లెక్కలపై ఫోకస్ తెచ్చింది. అయితే వంగా నుంచి వచ్చిన క్లారిటీ మాత్రం వైజయంతి నుంచి రాలేదు.

దీపిక ఇప్పుడు షారుక్ ఖాన్ ‘కింగ్’లో కూడా కీలక పాత్ర చేస్తోంది. ఈ ఏడాది కేప్‌టౌన్ షెడ్యూల్‌లో కూడా పాల్గొంది. అంటే అక్కడ నిర్మాతలు, దర్శకుడు, దీపిక మధ్య పని చేసే విధానం ముందే కుదిరింది. ఆమె అడిగిన ప్రతి షరతునూ అంగీకరించారని మాత్రం చెప్పలేం. కానీ సినిమా ముందుకు వెళ్తోందంటే కనీసం డేట్స్, పని పద్ధతి, రెమ్యునరేషన్ విషయంలో ఇద్దరికీ సరిపోయే డీల్ కుదిరిందన్నది నిజం కావచ్చు.

అల్లు అర్జున్, అట్లీ సినిమాలో కూడా పరిస్థితి ఇదే. దీపికను అధికారికంగా ప్రకటించారు. మోషన్ క్యాప్చర్ పనుల్లో కూడా ఆమె పాల్గొంది. ‘జవాన్’ తర్వాత అట్లీతో మరోసారి పని చేస్తోంది. ఈ సినిమా కూడా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. అయినా దీపికతో కాంబినేషన్ ముందుకు వెళ్లడం చూస్తే ‘స్పిరిట్’లో వచ్చిన వివాదం కారణంగా ఇతర పెద్ద ప్రాజెక్టులు ఆమెను పక్కన పెట్టిన పరిస్థితి లేదని అర్థమవుతోంది.

ఇక్కడ అసలు పాయింట్ అదే. ఒక స్టార్ అడిగే రెమ్యునరేషన్, పని గంటలు, లాభాల్లో వాటా అన్నీ ప్రతి సినిమాకు ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. పాత్ర ఎంత పెద్దది, ఎన్ని రోజుల షూట్ కావాలి, నిర్మాత బడ్జెట్ ఎంత, హీరో హీరోయిన్ కాంబినేషన్‌కు మార్కెట్ ఎంత అన్నదానిపై డీల్ మారుతుంది. ‘స్పిరిట్’లో కుదరని లెక్క ‘కింగ్’లో లేదా అట్లీ సినిమాలో వేరే పద్ధతిలో కుదిరి ఉండొచ్చు.

అందుకే దీపిక ఎక్కువ షరతులు పెడుతోంది కాబట్టి సినిమాలు పోతున్నాయని ఒకే లైన్‌లో చెప్పడం కష్టం. ‘స్పిరిట్’, ‘కల్కి 2’ ఆమె చేతిలో లేకపోయినా, మరోవైపు రెండు భారీ సినిమాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇప్పుడు అసలు మార్పు ఏమిటంటే పెద్ద స్టార్లతో సినిమా చేయాలంటే నటనతో పాటు డేట్స్, పని గంటలు, రెమ్యునరేషన్, లాభాల వాటా అన్నీ ముందే క్లియర్ చేసుకోవాల్సిన దశకు ఇండస్ట్రీ వచ్చేసింది. ఇక ఇలాంటి డీల్స్ లీక్స్ కంటే ముందే తేల్చుకోవడం నిర్మాతలకు కూడా చాలా అవసరం.

Tags:    

Similar News