దీపిక ఈ ముగ్గురు తెలుగు హీరోల‌కు అభిమాని!

ఇలాంటి స‌మ‌యంలో దీపిక ప‌దుకొనే టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది.;

Update: 2025-07-20 15:30 GMT

ప్ర‌భాస్ స‌ర‌స‌న 'క‌ల్కి 2898 ఎడి' చిత్రంలో న‌టించింది దీపిక ప‌దుకొనే. పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ తో ఎంట్రీ త‌ర్వాత వెనువెంట‌నే ప్ర‌భాస్ స‌ర‌స‌న `స్పిరిట్` లాంటి క్రేజీ మూవీలో న‌టించే అవ‌కాశం కూడా ద‌క్కించుకుంది. కానీ సందీప్ రెడ్డి వంగాతో దీపిక‌కు స‌రిగా సింక్ కుద‌ర‌లేదు. హ‌ద్దు మీరిన‌ ఫెమినిజాన్ని స‌హించ‌లేని సందీప్ వంగా దీపిక‌ను సినిమా నుంచి తొలగించారని గుస‌గుస‌లు వినిపించాయి. దీనిపై నెటిజ‌నుల్లో చాలా చ‌ర్చ సాగింది.

ఇలాంటి స‌మ‌యంలో దీపిక ప‌దుకొనే టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కాంబినేష‌న్ లో రూపొందుతున్న సైన్స్ ఫిక్ష‌న్ డ్రామాలో దీపిక ప‌దుకొనే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమా త‌ర్వాత కూడా దీపిక టాలీవుడ్ ని వ‌దిలిపెట్టే ఆలోచ‌న‌లో లేన‌ట్టే క‌నిపిస్తోంది.

దీపిక ఇప్ప‌టికే త‌న త‌దుప‌రి హీరోల లైన‌ప్ ని కూడా సిద్ధం చేసుకుంది. నేను ఎన్టీఆర్, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ లకు అభిమానిని అంటూ తెలివిగా పేర్లు రివీల్ చేసింది. ఓ ఇంట‌ర్వ్యూలో దీపిక మాట్లాడుతూ... ఆ మూడు పేర్ల‌లో రెండు కొత్త పేర్ల‌ను ప్ర‌స్థావించ‌డంతో ఫ్యాన్స్ ఎగ్జ‌యిట్ అవుతున్నారు. దీపిక ప్ర‌స్తుతం అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టించేస్తోంది కాబ‌ట్టి, త‌దుప‌రి ల‌క్ష్యం మ‌హేష్‌, ఎన్టీఆర్ అంటూ అంతా ఊహాగానాలు సాగిస్తున్నారు. ఎనిమిది గంట‌ల ప‌ని దినానికి నో చెప్పిన దీపిక‌కు మ‌హేష్, ఎన్టీఆర్ అవ‌కాశాలు క‌ల్పిస్తారా? అన్న‌ది వేచి చూడాలి.

Tags:    

Similar News